ప్రపంచంలో కెల్లా ఉత్తమమైన 'గే' లక్షణాలు కలిగిన 'గే ఐకాన్'గా ఆమె
బ్రిట్నీ స్పియర్స్ ఒకప్పుడు పాప్ ప్రపంచంలో తనకంటూ ఓ ఇమేజిని సంపాదించుకున్న స్టార్. రాను రాను తను చేసినటువంటి పనికి మాలిన పనులవల్ల తన ఇమేజిని కోల్పోవాల్సి వచ్చిన పరిస్దితి. ఇది మాత్రమే కాకుండా ఆదివారం జరిగినటువంటి గ్రామీ అవార్డుల కార్యక్రమంలో తను రూపోందించినటువంటి ఏ ఒక్క ఆల్బమ్‌కి కూడా అవార్డు దక్కకపోవడం విశేషం. ఇది చాలదన్నట్టు ఇటీవల కాలంలో ఆరంజ్ కంట్రీ ఈక్వాలిటీ ప్రాజెక్టు వారు ఓ సర్వే పోల్ నిర్వహించడం జరిగింది. ఆ సర్వే పోల్ ఏమిటంటే ప్రపంచంలో కెల్లా ఉత్తమమైన 'గే' ఐకాన్ ఎవరు..? అని.
ఈపోల్‌లో ప్రపంచంలో ఉన్నటువంటి పాప్ అభిమానులు అందరూ పాల్గోనడం జరిగింది. ద టాక్సిక్ హిట్ మేకర్ అయినటువంటి బ్రిట్నీ స్పియర్స్‌కు అత్యధికంగా 31శాతం ఒట్లు వేసి అభిమానులు ప్రపంచంలో కెల్లా ఉత్తమమైన 'గే' ఐకాన్‌గా మొట్టమొదటి స్దానాన్ని కట్టబెట్టడం జరిగింది. అటుతర్వాత రెండవ స్దానాన్ని25శాతం ఓట్లు సంపాదించి మరో పాప్ రాణి మడోన్నా కి కట్టబెట్టారు..ఈ సందర్బంలో ఈ సర్వేపోల్ నిర్వహించినటువంటి ప్రాజెక్టు ముఖ్య అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం పాప్ రాణి మడోన్నా ఎటువంటి కొత్త ఆల్బమ్‌లు విడుదల చేయకపోవడం వల్ల రెండవ స్దానానికి వెళ్శడం జరిగిందని అన్నారు.
అదే గనుక ఈసంవత్సరం ఏదైనా ఆల్బమ్‌ని విడుదల చేసినట్లైతే మొదటి స్దానానికి ఎగబాకేదని అన్నారు. నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గే కమ్యూనిటీకి సారధి మడోన్నా మాత్రమే అని అన్నారు. ఇక మాడవ స్దానాన్ని మరో పాప్ సంచలనం లేడిగాగా 22శాతం ఓట్లు సంపాదించి కైవసం చేసుకోవడం జరిగిందని అన్నారు. ఇటీవల జరిగినటువంటి గ్రామీ అవార్డులలో లేడిగాగా తన జయకేతనాన్నిఎగరవేసిన విషయం తెలిసిందే..


Click it and Unblock the Notifications











