ఆమె చనిపోయిందనే విషయం నాకు ముందుగానే తెలుసు..!!
'క్లూలెస్' తార బ్రిటానీ ముర్ఫి మరణానికి మితిమీరిన డ్రగ్సే కారణమనే వార్తలను ఆమె తల్లి షరాన్ ముర్ఫి ఖండించారు. తన బిడ్డకు అలాంటి అలవాటు లేదని ఆమె బ్రిటానీ మరణానంతరం ఇచ్చిన తొలి ఇంటర్యూలో పేర్కొంది. ఇటీవల బ్రిటానీ తల్లి షరాన్ ముర్శి, భర్త సిమాన్ మోన్ జాక్ ఓ ప్రయివేట్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో బ్రిటానీ చనిపోయిన రోజునాటి చేదుజ్ఞాపకాలను ఓ సారి గుర్తుచేసుకున్నారు. "గత సంవత్సరం డిసెంబరు 20వ తేదీ ఆదివారం నాడు ఉదయం నా కూతురు నిర్జీవంగా పడివుండటం గమనించాను. వెంటనే 911 ఎమర్జెన్సీ కాల్ చేసి నేను, సిమాన్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లము. ఆ తర్వాత డాక్టర్లు ఆమెను బ్రతికించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు లాభం లేదని చేతులెత్తేసారు. నాకు మాత్రం డాక్టర్లు ఇంకా తెలుపక ముందే ఆమె మరణించింది అనే విషయం అర్థమయింది. నా కూతురు నన్ను విడిపోతోందని అని నాకు స్పష్టంగా అర్థమయింది. ఆ క్షణాన నేను తల్లడిల్లిపోయాను" అని బ్రిటానీ తల్లి సిమాన్ ఆవేదనాపూరిత స్వరంలో వెళ్లడించింది.
ఇక ఆమె భర్త సిమాన్ మాట్లాడుతూ పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ బ్రిటానీవి కావని, అవి తనవని బ్రిటానీకి డ్రగ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని అతను స్పష్టం చేసాడు. కాగా ఈమె మరణానికి సంబంధించి అధికారిక నివేదిక ఇంకా వెళ్లడికాలేదు.


Click it and Unblock the Notifications











