మైఖేల్ జాక్సన్ డ్రగ్సే ఈమె ప్రాణాలు కూడా తీసాయి..!!
'జస్ట్ మ్యారీడ్', 'క్లూలెస్' వంటి హాలీవుడ్ సినిమాల్లో నటించిన తార బ్రిట్టనీ ముర్ఫి గత ఆదివారం ఉదయం 10 గంటలకు మరణించిన సంగతి తెలిసిందే. గత ఆదివారం ఉదయం 8గంటలకు షవర్ లో స్నానం చేస్తు హఠాత్తగా సృహతప్పి పడిపోయిన ముర్ఫిని ఆసుపత్రిగా తరలించగా రెండు గంటల పాటు మృత్యువుతో పోరాడి అలసి మృత్యు ఒడిలోకి జారుకున్నారు. కాగా ఆమె మరణానికి గుండె సంబంధిత వ్యాధి కారణమని tmz.com కథనం.
కానీ తాజా వార్త ఏంటంటే ఆమె వాడుతున్న డ్రగ్సే ఆమె ప్రాణాలను తీసాయని ఆమె సన్నిహితులు వాపోతున్నారు. అదీ కాక ఈ డ్రగ్స్ వల్లే ప్రముఖ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ మృతి చెందడం గమనార్హం. మైఖేల్ లాగే ఎన్నో ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న ఈ తార ఆ తర్వాత పెయిన్ రిలీఫ్ కోసం వికోడిన్ అనే పెయిన్ కిల్లర్ ను వాడటం మొదలు పెట్టింది. మైఖేల్ జాక్సన్ కూడా ప్లాస్టిక్ సర్జరీల బాధ నుండీ విముక్తి పొందడానికి ఇవే పెయిన్ కిల్లర్ డ్రగ్స్ వాడటం జరుగుతుండేది. ఆ తర్వాత అధిక మోతాదులో ఈ డ్రగ్స్ తీసుకోవడమే అతని హఠాన్మరణానికి కారణం అని డాక్టర్లు తేల్చారు. ఇప్పుడు బ్రిట్టనీ కూడా అవే డ్రగ్స్ తీసుకోవడం వల్లే మరణించిందని ఆమె సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.
ఈ డ్రగ్స్ తీసుకోవద్దని ఆమెకు ఎన్నో సార్లు విన్నవించుకున్నా ఆమె వీటికి బాగా అలవాటు పడిపోవడంతో మానలేక పోయిందని, ఇప్పుడవే డ్రగ్స్ ఆమె ప్రాణాలు తీయడం దురదృష్టకరం అని ఆమె స్నేహితుడొకరు వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











