అదంతా బూటకం.. ఆమెకా అలవాటు లేదు..!!
గత 20 వ తారీఖున మృతి చెందిన హాలీవుడ్ నటి, గాయని బ్రిటానీ ముర్ఫీ మృతికి ఆమె మితిమీరిన మోతాదులో డ్రగ్స్ వాడటమే కారణం అని ఆమె స్నేహితులు, డాక్టర్లు సైతం దృవీకరించినట్టు అనధికార ప్రకటన రావడం, దీనికి తోడు ఆమె వాడిన డ్రగ్స్ తరహా డ్రగ్స్ వాడటం వల్లే మైఖేల్ జాక్సన్ మృతి చెందాడని వార్తలు రావడంతో దాన్ని మీడియా పదే పదే ప్రసారం చెయ్యడంతో ఈ వార్తలను ఖండించడానికి ఆమె భర్త మీడియా ముందుకు వచ్చాడు.
అసలు బ్రిటానీ ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, కానీ ప్లాస్టిక్ సర్జరీల బాధ నుండీ ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్ లు వాడేదని చెప్పుకొచ్చాడు. అసలు ఆమె డ్రగ్స్ తీసుకుంటోంది అనే వార్తలు ఎలా వచ్చాయో తనకు తెలియదని, ఆ వార్తల్లో నిజం లేదని అతను చెప్పుకొచ్చాడు. కానీ లాస్ ఏంజిల్స్ పరిశోధనా విభాగం అందించిన సమాచారం ప్రకారం ఆమె గదిలో శోదాలు జరిపినప్పుడు డాక్టర్ల చేత సూచించబడిన డ్రగ్స్ కు సంబంధించిన బిల్లులు, కొన్ని డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
ఇప్పటి వరకూ వచ్చిన అధికారిక ప్రకటన ప్రకారం ఆమె గుండెకు సంబంధించిన వ్యాధితో మృతి చెందినదని తెలిసింది. ఆమె మృతిని ఆమె తండ్రి జీర్ణించుకోలేక పోతున్నారు. అసలు ఆమె వయసు కేవలం 32. అంకా ఎంతో జీవితం ఉండగానే ఇంత అర్ధాంతరంగా మృతి చెందడం చాలా బాధగా వుందని అతను ఆవేదన వ్యక్తం చేసారు. ఇదిలా వుంటే ఆమె తన విల్లలో తన ఎస్టేట్ ను తన తల్లి పేరిట రాసినట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











