60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 'టీ మరియు కేకు'

By Nageswara Rao

లండన్, జూన్ 4: బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ పాలనకు శనివారంతో 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వారాంతంలో తాను ఇస్తున్న పార్టీని వదులుకోవద్దని హాలీవుడ్ సెక్సీ హీరోయిన్ కెల్లీ బ్రూక్ తెలిపింది. 32 సంవత్సరాల వయసు కలిగిన కెల్లీ బ్రూక్ ఈ పార్టీలో 'టీ మరియు కేకు' తో అందరిని అలరించనుంది. నేను నిర్వహిస్తున్న డైమండ్ జూబ్లీ పార్టీలో టీ మరియు కేకు ఉండనున్నాయి.

చిన్న చిన్న కిరీటాల మాదిరి కేకుని రూపొందిచడంతో పాటు, 50'లలో ధరించిన ప్రింటెడ్ డ్రస్సులను పార్టీలో అందరూ దర్శమిస్తారని ఓ ప్రముఖ టివి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపింది. నేనైతే ఈ పార్టీలో చాలా పాతకాలపు-లుక్‌తో పాటు వంకర జుట్టు మరియు ముత్యాలతో రాక్ చేస్తానని చెప్పింది. ఇది ఇలా ఉంటే రెండో ఎలిజబెత్ రాణి పాలనకు శనివారంతో 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం సాయంత్రం లండన్‌లోని చారిత్రక థేమ్స్ నదిలో వెయ్యి పడవలతో నిర్వహించిన కార్యక్రమం ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. 86 ఏళ్ల ఎలిజబెత్ భర్త ఫిలిప్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి రాజనౌకలో విహరించారు.

దాదాపు పది లక్షల మంది ప్రజలు నది పొడవునా గుమికూడి నౌకావిహారాన్ని తిలకించారు. జాతీయ పతాకాలు చేబూని రాణికి శుభాకాంక్షలు తెలిపారు. లండన్‌లో, థేమ్స్‌లో ఇలాంటి వేడుక జరగడం గత 350 ఏళ్లలో ఇదే తొలిసారి. మబ్బులు కమ్ముకున్నా జనం రాణి విహారం కోసం ఆసక్తిగా వేచి చూశారు. వేడుక ముగింపు సమయంలో వర్షం పడటంతో అంతరాయం కలిగింది. రెండో ఎలిజబెత్ దేశాధినేతగా ఉన్న 16 దేశాలు సహా పలు కామన్వెల్త్ దేశాల్లో కూడా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X