నైట్ క్లబ్‌లో మాజీ ప్రేయసికి షాంపైన్ బాటిల్ పంపిన ప్రియుడు
న్యూయార్క్, జూన్ 12: హాలీవుడ్ సింగర్ క్రిస్ బ్రౌన్ తనతో పాటు అదే క్లబ్‌లో ఉన్న ఎక్స్ - ఫ్లేమ్ సింగర్ రిహానాను చూసి ఛాంపైన్ బాటిల్‌ను పంపాడు. న్యూయార్క్‌లో ఉన్న ఎస్‌ఎల్ నైట్ క్లబ్‌లో వీరిద్దరూ పార్టీ నిమిత్తం ఒకరికొకరు తెలియకుండా వెళ్లి వేరు వేరు టేబుల్స్‌లలో కూర్చున్నారు. కొంత సేపటి తర్వాత ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నప్పటికీ.. కేవలం చూపులతో మాత్రమే పలకరించుకున్నారు.
24 సంవత్సరాల వయసు కలిగిన సింగర్ రిహానా క్రిస్ బ్రౌన్ టేబుల్‌ని దాటుకోని వెళ్లినప్పటికీ తన చూపులలో ఎటువంటి ఎమోషన్స్‌ని చూప లేదు. వీరిద్దరిని ఒకరునొకరు చూసుకుంటున్న విషయాన్ని అక్కడున్న ఎవరూ గమనించకుండా జాగ్రత్త పడ్డారు. తన సహాచరుల సహాయంతో రిహానా బాతు రూమ్‌కి వెళ్లినప్పటికీ.. క్రిస్ బ్రౌన్‌తో మాట్లాడలేదు.
ఇటీవలే రిహానా, క్రిస్ బ్రౌన్ ఇద్దరూ కలిసి 'టర్న్ అఫ్ ద మ్యూజిక్, భర్తడే కేక్' అనే రెండు ట్రాక్‌లలో కలిసి పని చేశారు. క్రిస్ బ్రౌన్ 2009లో రిహానాపై దౌర్జన్యం చేయడంతో ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం సింగర్ రిహానా బాస్కెట్ బాల్ ప్లేయర్ 'జూనియర్ స్మిత్' తో డేటింగ్ చేస్తుందంటూ హాలీవుడ్‌లో రూమర్స్ హాల్ చల్ చేస్తున్నాయి. 24 సంవత్సరాల వయసు కలిగిన రిహానా ఫ్లోరిడాలో జరిగిన ఓ ఈవెంట్లో కలుసుకోవడం జరిగిందని సమాచారం. వారాంతంలో వీరిద్దరిని చూసిన వారు ఇద్దరూ కలిసి ఏకాంతంగా కొంత సమయం గడిపినట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











