»   » వేలానికి బ్రూస్ లీ పర్సనల్ వస్తువులు

వేలానికి బ్రూస్ లీ పర్సనల్ వస్తువులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ప్రముఖ హాలీవుడ్ నటుడు, కుంగ్ ఫూ స్టార్ బ్రూస్ లీకి సంబంధించిన కొన్ని పర్సనల్ వస్తువులను వేలం వేయనున్నారు. ఏప్రిల్ 29 లాస్ ఏంజిల్స్‌లో ఈ వేలం కార్యక్రమం జరుగనుంది. బ్రూస్ లీకి సంబంధించిన స్టిర్లింగ్ కూపర్ గ్రే కాటన్ జాకెట్, షూస్, కిక్కింగ్ షీల్డ్స్ ఇందులో ఉన్నాయి. జాకెట్‌పై బ్రూస్ లీ వైఫ్, కూతరు సంతకం కూడా ఉంది. వీటి కనీస ధర 40వేల అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు. గతంలో బ్రూస్ లీకి సంబంధించిన వస్తువులు వేలం వేయగా భారీ ధరకు అభిమానులు కొనుగోలు చేసారు. ఇపుడు కూడా మంచి ధర పలుకుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

బ్రూస్ లీ గురించిన వివరాల్లోకి వెళితే...
చైనా జాతీయుడైన బ్రూస్లీ అసలు పేరు 'లీ జున్ ఫాన్'. ఇది ఆడపిల్లకు పెట్టే పేరు. చిన్నప్పుడు ఆరోగ్యం బాగోలేకపోవడంతో అతని తల్లి తన నమ్మకం కొద్దీ ఈ పేరు పెట్టింది. మూడు నెలల వయసులోనే సినిమాలో నటించిన బ్రూస్ లీ.. ఆ తర్వాత పెద్దయ్యాక కూడా సినిమా రంగంలో నటునిగా, దర్శకునిగా విశ్వవ్యాప్తంగా పేరు సంపాదించాడు. 1940లో అమెరికాలో జన్మించిన బ్రూస్లీ కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించారు.

Bruce Lee's personal items to be auctioned

బ్రూస్ లీ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. సెరిబ్రల్ ఎడెమాతో, ఈక్వా జెసిక్ అనే పెయిన్ కిల్లర్ రియాక్షన్‌తో మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. కానీ.. పలు రకాల వాదనలు ఆయన మరణంపై అలానే ఉన్నాయి. పాత వ్యాయామాలు చాలక తనే కొత్తకొత్త వ్యాయామాలు సృష్టించి మితిమీరి చేసిన వ్యాయామాల వల్లే మరణం సంభవించిందని ఒకరంటే.. తలనొప్పి తగ్గడానికి అతని గర్ల్ ఫ్రెండ్ "బెట్టీ" ఇచ్చిన మందుబిళ్ళ రియాక్షన్ వల్ల చనిపోయాడని మరో పుకారు ఉంది.

ఇతరులకు చెప్పకూడని కుంగ్ ఫూ రహస్యాలను అమెరికన్స్ కు నేర్పిస్తున్నాడని కోపం వచ్చిన చైనీస్ మార్షల్ ఆర్ట్స్ కమ్యూనిటీ చేసిన చేతబడిలాంటి ఒక క్రియ వల్ల అతను చనిపోయాడని మరో నమ్మకమూ ప్రచారంలో ఉంది. ఒక ఆసియన్ నటుడు హాలీవుడ్ లో అనూహ్యంగా ఎదగడాన్ని జీర్ణించుకోలేని అమెరికన్ మాఫియా కుట్రవల్లే బ్రూస్లీ హత్యచేయబడ్డాడనీ ఇంకో వాదనుంది. తర్వాత కాలంలో తండ్రి మరణం గురించి తెలుసుకున్నందుకే బ్రూస్లీ కుమారుడైన బ్రాండన్ లీని కూడా 28 ఏళ్ల వయసులోనే చంపేశారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

English summary
Bruce Lee's fans can now buy his clothes and other personal items when they go under the hammer on April 29 in Los Angeles. The items, including a Stirling Cooper grey cotton jacket that has been signed by martial arts' icon's wife and daughter, his shoes and kicking shield, are being sold by auctioneer Nate D Sanders.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu