twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రూస్‌ లీ సూటు అమ్మకం..అదిరిపోయే రేటు

    By Srikanya
    |

    హాకాంగ్‌: ప్రక్క చిత్రంలో కనిపిస్తున్న పసుపు రంగు జంప్‌సూట్‌.. హాంకాంగ్‌లో జరిగిన వేలంలో రూ.62.05 లక్షలు (62,05,392 రూపాయలు) పలికింది. కుంగ్‌ఫూ వీరుడు బ్రూస్‌ లీ.. ఈ సూట్‌ను తన చివరి చలనచిత్రం 'గేమ్‌ ఆఫ్‌ డెత్‌'లో ధరించారు. బ్రూస్‌ లీ 40 వర్దంతి సందర్భంగా ఈ కోటును వేలం వేయగా ఓ అజ్ఞాత వ్యక్తి దీన్ని కొనుగోలు చేశారు.

    కుం ఫూను ఒక క్రీడగా చైనీయులు అభివృద్ధి చేస్తే, అందులో కొత్తకొత్త పోరాట విధానాలను కనిపెట్టిన ఘనత హాలీవుడ్ నటుడు బ్రూస్ లీకి దక్కుతుంది. 'వింగ్ చున్' విధానంలోని 'వన్ ఇంచ్ పంచ్'కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు బ్రూస్ లీ. అతను బతికి ఉన్నంతకాలం ఈ పంచ్ గురించిన రహస్యం బైటపడలేదు. 1964లో జరిగిన లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్‌షిప్‌లో మొట్టమొదటిసారి అతను ఈ పంచ్‌ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

    Bruce Lee

    ఆబ్జెక్ట్‌కు కేవలం ఒక అంగుళం దూరంలో చేతిని ఉంచి, కనురెప్ప కాలంలో బలమైన పంచ్‌ని విసరడం ఎలా సాధ్యమైందో ఎవరూ గుర్తించలేకపోయారు. చాలాకాలం ఈ విధానంపై అధ్యయనాలు జరిగాయి. చివరికి టెక్నిక్‌తో మాత్రమే ఇది సాధ్యమవుతుందన్న నిర్ధారణకు వచ్చారు. సహజంగా శక్తినంతా కూడగట్టుకొని, చేతిని బలంగా విసిరితే తప్ప బలమైన దెబ్బ తగలదు. కానీ, బ్రూస్ లీ మందంగా ఉండే చెక్కను సైతం వన్ ఇంచ్ పంచ్‌తో ముక్కలు చేసేవాడు.

    ఆబ్జెక్ట్‌కు అతి సమీపం నుంచి కొడితే అంత బలమైన దెబ్బ తగులుతుందన్నది ఆశ్చర్యం కలిగించినా, అది అక్షర సత్యమని నిరూపించాడు బ్రూస్ లీ. ఇప్పుడు అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్‌లో వన్ ఇంచ్ పంచ్ ఒక భాగమైంది. అయితే, అపారమైన అనుభవం ఉన్నవారికే అది సాధ్యమవుతుంది. ఐదు దశాబ్దాల క్రితమే వన్ ఇంచ్ పంచ్‌ని ప్రపంచానికి పరిచయం చేసిన బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్స్ ఉన్నంతకాలం బతికే ఉంటాడు.

    English summary
    Late kung fu star Bruce Lee's iconic yellow jumpsuit and matching nunchucks that were immortalized in his final fight scenes will go under the hammer at an auction in Hong Kong on Thursday, 40 years after his death. Fans will also get the chance to bid for 12 other personal items at the auction, which is expected to fetch a total of HK$1 million to HK$1.5 million (US$129,000 to US$193,000).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X