ఆయన మాయాడ్ క్యాంపెయిన్ లోచేయడం మాకు చాలా ఆనందం..
బ్రూస్ విల్లిస్ అమెరికన్ యాక్టర్ మరియు ప్రోడ్యూసర్. డైహార్డ్ సిరిస్ లలో నటించినటువంటి జాన్ మెక్ క్లేన్ అనే క్యారెక్టర్ ద్వారా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఎన్నో బాక్సాఫీసు రికార్డులు సాధించినటువంటి సిన్ సిటి, పల్ప్ ఫిక్షన్, ది ఫిప్త్ ఎలిమెంట్ లాంటి సినిమాల్లో నటించడం జరిగింది. హాలీవుడ్ లో ఎంత ప్రముఖంగా భావించేటటువంటి ఎమ్మీ అవార్డును రెండు సార్లు కైవసం చేసుకున్నారు.
ఇటీవల కాలంలో బ్రూస్ విల్లీస్ ఓ అరుదైన యాడ్ లోనటించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. రష్యా రాజధాని మాస్కో లో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ట్రస్ట్ బ్యాంక్ కుఎడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ గాగతంలో రష్యన్ వెయిట్ లిప్టర్ మరియ యాక్టర్ అయినటువంటి వ్లాదిమిర్ టర్చ్సిస్కీ చనిపోయిన తర్వాత ఆయనకు బదులు బ్రూస్ విల్లీస్ నినియమించారు. ఎప్పుడైతే బ్రూస్ విల్లీస్ యాడ్ క్యాంపెయిన్ గాఅనుకున్న వెంటనే ఆయన ఫోస్టర్స్ మాస్కో వీధుల్లో దర్శనమిస్తున్నాయంట. అంతేకాకుండా అందరిని ఆకట్టుకునే విధంగా యాడ్ క్రింద టాగ్ లైన్ 'ట్రస్ట్ ఈజ్ జస్ట్ లైక్ మి బట్ ఎ బ్యాంక్' అంటూ అందరిని బాగా ఆకట్టుకుందని సమాచారం.
చివరగా బ్యాంక్ కుసంబంధించినటువంటి అధికారులు మాట్లాడుతూ బ్రూస్ విల్లీస్ మేము యాడ్ క్యాంపెయిన్ లోతీసుకోవడానికి కారణం కంపెనీ విలువలను ప్రపంచ వ్యాప్తంగా తన నమ్మకంతో పంచగలడని మాఉద్దేశ్యం అని అన్నారు. ఐతే ఈయాడ్ లోనటించినందుకుగాను బ్రూస్ విల్లీస్ కుఎంత సోమ్ము ముట్టచెప్పారనేది గుట్టుగా దాచారు.


Click it and Unblock the Notifications











