బాయ్‌ఫ్రెండ్ చేతిలో బుక్కైన హాట్ బ్యూటీ.. తలవంచక తప్పలేదు (వీడియో)!
Recommended Video

బ్రిజిల్ దేశానికి చెందిన బాలీవుడ్ నటి బ్రూనా అబ్దుల్లా నిశ్చిత్తార్థం అనూహ్య పరిస్థుతుల్లో జరిగిపోయింది. తన నిశ్చితార్థం జరుగుతుందని తాను కూడా ఊహించి ఉండకపోవచ్చు. అకస్మాత్తుగా పాకెట్ నుంచి ఎంగేజ్‌మెంట్ రింగ్ తీసి బ్రూనా ముందు పెట్టేసరికి ఆమె మతిపోయింది. ఆమె నిశ్చితార్థానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అందమైన ప్రదేశంలో
శృంగార తారగా ముద్ర వేసుకొన్న బ్రూనా అబ్దుల్లా ప్రస్తుతం స్కాట్‌లాండ్‌కు చెందిన బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్ చేస్తున్నది. వారిద్దరూ కలిసి ఓ అందమైన ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లినట్టు, అక్కడే సడెన్‌గా బాయ్‌ఫ్రెండ్ ఎంగేజ్‌మెంట్ రింగ్ తీసి ముందు పెట్టారు. దాంతో బ్రూనా ఉద్వేగానికి లోనయ్యింది.

ఉద్వేగానికి గురైన బ్రూనా
బ్రూనా కాసేపటికే ఉద్వేగం నుంచి బయటపడి తన బాయ్‌ఫ్రెండ్ చేసిన ప్రపోజల్‌కు ఓకే చెప్పింది. ఉద్వేగంలో ఆనందభాష్పాలు రాల్చింది. ఆ తర్వాత అతడి కౌగిలిలోకి ఒదిగిపోయింది. ప్రేమానురాగాల మధ్య బ్రూనా వేలికి ఉంగరాన్ని తొడిగి తన సొంతం చేసుకొన్నాడు బాయ్‌ఫ్రెండ్. ఈ తతంగాన్నంత అందంగా చిత్రీకరించిన వీడియో వైరల్ అయింది.

వీడియో వైరల్
ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన బ్రూనా ఎంగేజ్‌మెంట్ వీడియో సంచలనం రేపింది. కొద్ది గంటల్లోనే 68 వేలకుపైగా వ్యూస్ సాధించింది. కంగ్రాట్స్ చెబుతూ వేల సంఖ్యలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
బ్రూనా బాలీవుడ్ కెరీర్
2007లో క్యాష్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. రహమ్ కరో అనే పాటతో యువతను పిచ్చెక్కించింది. ఆ తర్వాత ఐ హేట్ లవ్ స్టోరీస్, గ్రాండ్ మస్తీ చిత్రాల్లో నటించింది. అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం నటించిన దేశీ బాయ్స్‌లో సుబా హోనే నా దే నర్తించింది. తమిళ చిత్రం భిల్లాలో కీలక పాత్రలో కనిపించింది.


Click it and Unblock the Notifications











