Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాక్సాఫీసు రికార్డుల్నినమోదు చేసినటువంటి సినిమా రీమేక్ త్వరలో
1996లో విడుదలై హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపినటువంటి సినిమా 'గంబిట్'. అటువంటి గొప్ప కలాఖండాన్ని మరలా రీమేక్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు ఈసినిమా నిర్మాతలు కోయిన్ బ్రదర్స్. ఈసినిమాలో హీరోగా కోలిన్ ఫిర్త్, హీరోయిన్గా కామెరూన్ డియాజ్ని తీసుకున్నట్లు సమాచారం. గంబిట్ సినిమాకి సంబంధించినటువంటి స్క్రిప్ట్ పక్కాగా తయారు చేసుకోని త్వరలోనే సెట్స్ మీదకు వెళ్శనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈసినిమా దర్శకత్వ బాధ్యతలను 'ద లాస్ట్ స్టేషన్' సినిమాకు దర్శకత్వం వహించినటువంటి స్టార్ డైరెక్టర్ 'మైఖెల్ హాప్మ్యాన్'కి అప్పగించనున్నారు.
1996లో ఈసినిమాలో హీరోగా మైఖెల్ కెయిన్, హీరోయిన్గా షెర్లీ మాక్లెయిన్ నటించడం జరిగింది. ప్రస్తుతం చేస్తున్నటువంటి రీమేక్ సినిమాలో మైఖెల్ కెయిన్ పాత్రలో కోలిన్ ఫిర్త్, షెర్లీ మాక్లెయిన్ పాత్రలో కామెరూన్ డియాజ్ నటించడం జరుగుతుందని నిర్మాతలు వెల్లడించారు. ఈసినిమాకు సంబంధించినటువంటి షూటింగ్ మే 11నుండి లండన్‌లో ప్రారంభం కానుందని అన్నారు.
ఇక కోలిన్ ఫిర్త్ ఇటీవల నటించినటువంటి ద కింగ్స్ స్పీచ్ సినిమా హాలీవుడ్లో బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇది మాత్రమే కాకుండా ఈసినిమా ఆస్కార్ బరిలో కూడా నామినేషన్స్ సంపాదించింది. కోలిన్ ఫిర్త్ నటించినటువంటి ఈసినిమాకి ఆస్కార్ అవార్డు కూడా రావచ్చుననే ఉద్దేశ్యంతో ఉన్నట్లు సమాచారం.