ఆస్కార్ అవార్డ్స్ నైట్ షో లో ఇరగదీయడానికి వచ్చేవారంలో మీముందుకి ..
హాలీవుడ్‌లో రియాలిటీ షో అయినటువంటి 'రియల్ హౌస్ వైప్స్ ఆఫ్ బేవరి హిల్స్' స్టార్ కామెల్లీ గ్రామర్ సిఎన్‌ఎన్ లో ఆస్కార్ అవార్డ్స్ కరస్పాండెంట్‌గా వ్యవహారించడానికి ఎంపిక అవ్వడం జరిగింది. ఈవిషయాన్ని తానే స్వయంగా వెల్లిడించడం జరిగింది. ఇటీవలే తన భర్త నుండి విడాకులు తీసుకున్నటువంటి కామెల్లీ గ్రామర్ వచ్చే వారం జరగనున్న ఆస్కార్ అవార్డ్స్ షో బిజ్‌లో కార్యక్రమం మొత్తాన్ని యావత్ ప్రేక్షకులకు కామెంటేటర్‌గా అలరించనున్నారు.
వచ్చే వారం రెడ్ కార్పెట్‌లో సిఎన్‌ఎన్‌కి సంబంధించినటువంటి పెద్దలు ఏజే హామ్మర్, బ్రూక్ ఆండర్సన్‌తో కలసి కామెల్లీ గ్రామర్ అలరించనున్నారు. ఈసందర్బంలో ఆస్కార్ అవార్డ్స్ షోకి సంబంధించినటువంటి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ డేవి లివెన్ మాట్లాడుతూ కామెల్లీ చేసేటటువంటి అద్బుతమైన కామెడీని మేము అందరం చూడాలని ఎంతగానో ఆశక్తిగా ఉన్నాం అని అన్నారు.


Click it and Unblock the Notifications











