twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అవతార్' 'టైటానిక్' ను ముంచేయనుందా..??

    By Kuladeep
    |

    జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అద్భుత సాంకేతిక మాయాజాలం 'అవతార్' వరుసగా నాలుగవ వారం కూడా బాక్సాఫీసు వద్ద తొలి స్థానాన్ని నిలబెట్టుకుంది. గత వారం 48.5 మిలియన్ డాలర్లను వసూలు చేసి ఈ ఘనతను సాధించింది. 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' పేరిట వున్న రికార్డును బద్దలుకొట్టి ప్రపంచంలో రెండవ అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డును సృష్టించిన ఈ సినిమా ప్రస్తుతానికి 1.3 బిలియన్ డాలర్ల పైచిలుకు వసూళ్లను రాబట్టి ఈ ఘనతను సాధించింది.

    కాగా అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ప్రథమ స్థానంలో వున్న టైటానిక్ (1.8 బిలియన్ డాలర్లు) సినిమా రికార్డును అవతార్ తిరగరాస్తుంది అనే అంచనాలు ఎక్కువయ్యాయి. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. విడుదలయిన నెల రోజుల్లోపే బిలియన్ డాలర్ల మార్కును చేరుకోవడం, సినిమా వసూళ్లు చెప్పుకునేంతగా ఎక్కడా తగ్గుముఖం పట్టకపోవం, వరుసగా నాలుగవ సారి బాక్సాఫీసు వద్ద ప్రథమ స్థానంలో నిలవడం, గతంతో పోల్చితే ఇప్పుడు పెరిగిన టికెట్ ధరలు పెరగటం లాంటివి చూస్తుంటే ఈ సినిమా తప్పక ఈ రికార్డును బ్రేక్ చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదని అనిపిస్తోంది.

    దీనికి తోడు ఇటీవలే చైనాలో విడుదలయిన ఈ సినిమాకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడ అవతార్ సినిమా టికెట్లను తమ స్నేహితులకు బహుమతులుగా ఇచ్చుకుంటున్నారంటే ఈ సినిమాకు అక్కడున్న డిమాండ్ ఏంటో అర్థంచేసుకోవచ్చు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా టైటానిక్ రికార్డును కూడా అధికమించి సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X