twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Cannes 2021: ముగిసిన వేడుకలు.. దారుణంగా చోరికి గురైన హాలీవుడ్ నటి

    |

    ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021 గతవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జూలై 17న ఈ వేడుకలు ముగియనున్నాయి. కరోనావైరస్ మహమ్మారి కారణంగా గత ఏడాది వేడుకలు వాయిదా పడ్డాయి. ప్రపంచాన్ని కుదిపేసిన వైరస్ కారణంగా సుమారు 14 నెలలు ఆలస్యంగా ఈ వేడుకలు కోవిడ్ ప్రొటోకాల్స్, ఆంక్షల మధ్య ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఏడాది ముఖాలకు మాస్కులు లేకుండానే సినీ ప్రముఖులను అనుమతించడం గమనార్హం. ప్రారంభోత్సం రోజున థియర్రీ ఫ్రెమాక్స్ ప్రపంచ సినిమా గురించి ఉపన్యాసం చేశారు. అన్ని రకాల ప్రొటోకాల్స్‌ను పాటిస్తున్నామని స్పష్టం చేశాడు.

    కేన్స్ 2021 వేడుకల్లో స్పైక్ లీ, మెలానిక్ లారెల్, మటి దియోపి, మైలెన్ ఫార్మర్, మ్యాజిక్ గిల్లెన్‌హాల్, జెస్సికా హాస్నర్, క్లబెర్ మెనండోంకా, తాహిర్ రహీమ్, సాంగ్ కాంగ్ హో లాంటి ప్రముఖులతో జ్యూరీని ఏర్పాటు చేశారు. ఈ సారి తొమ్మిది మంది సభ్యులతో కూడిన జ్యూరీలో ఐదుగురు మహిళలు ఉండటం విశేషం.

    Cannes 2021: Jodie turner Smith lost jewellery 10000 euros worth

    కేన్స్ అంటే తారల వెలుగు జిలుగులు గుర్తుకు వస్తాయి. ఈ ఏడాది కూడా అలాంటి జిలుగులతో వేడుక కళకళలాడింది.. నిధి సునీల్, జోడీ ఫాస్టర్, జోడీ టర్నర్, బెల్లా హ్యాడిడ్ లాంటి తారలు మీడియాను ఆకర్షించారు.

    చివరి రోజున హాలీవుడ్ తార జోడి టర్నర్ స్మిత్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె నగలు దోపిడికి గురి కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేన్స్ ముగింపు రోజున సుమారు మూడు గంటల నేను పోలీస్ స్టేషన్‌లోనే గడిపాను. దాదాపు పదివేల యూరోల విలువైన నగలు పోయాయి. గురువారం జరిగిన రెడ్ కార్పెట్ షోలో వజ్రాలతో కూడిన నగలు ధరించి హొయలు ఒలికించారు. అయితే అనూహ్యంగా నగలు చోరికి గురికావడంతో ఆమె నిరుత్సాహానికి గురయ్యారు.

    ఇక జోడి టర్నర్ స్మిత్ ఇటీవల బ్రిటీష్ వెబ్ సిరీస్‌లో అన్నే బొలైన్ అనే పాత్రలో కనిపించారు. డైరెక్టర్ కొంగొనాడాకు సపోర్ట్ చేయడానికి కేన్స్ వేడుకకు హాజరయ్యారు. ఈ చిత్రంలో కోలిన్ ఫారెల్‌తో కలిసి నటించారు.

    English summary
    Prestigious Cannes 2021 has finished amid Covid 19 pandemic. This time event went with highly protocals. Actress Jodie turner Smith lost jewellery 10000 euros worth.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X