twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మానసిక వ్యాధితో సతమతమైన కెప్టెన్ అమెరికా

    |

    క్రిస్ ఇవాన్స్, అదేనండి మన యూనివర్సల్ హీరో, కెప్టెన్ అమెరికా ప్రపంచవ్యాప్తంగా మొట్ట మొదటి అవెంజర్ గా ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. సూపర్ స్టార్ గా పాపులారిటీని పెంచుకున్నాడు. అతడి రియల్ నేమ్ కన్నా రియల్ నేమ్ తోనే సగం మంది జనాభా అతడిని గుర్తుపడతారు అంటే, ఏ రేంజ్ లో కెప్టెన్ అమెరికా పాత్ర క్రిస్ కు గుర్తింపు తెచ్చిపెట్టిందో అర్ధం చేసుకోవచ్చు.

    అయితే, అలాంటి పాత్ర తొలిసారి తన వద్దకు వచ్చినప్పుడు వద్దనుకున్నాడట క్రిస్.
    లాక్ డౌన్ నేపథ్యంలో ఓ హాలీవుడ్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన క్రిస్ ఎవాన్స్ కెరీర్ తొలినాళ్లలోని అనుభవాలను నెమరవేసుకున్నాడు.

    Cap.America suffered with Anxiety Disorder

    ఇందులో భాగంగానే తొలుత కెప్టెన్ అమెరికా పాత్రను వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. దీనికి కారణం అప్పట్లో తాను మానసిక సమస్యలతో బాధపడుతుండటమేనని వెల్లడించాడు. 2010లో పంక్చర్ అనే సినిమాలో నటిస్తుండగా తొలిసారి తాను మానసిక వ్యాధికి గురైనట్లు తెలిపాడు. సినిమా షూటింగ్ మధ్యలో తీవ్రమైన ఒత్తిడికి లోనై, ఇక నటనకు స్వస్తి పలుకుదామని నిర్ణయించుకున్నాడట క్రిస్. ఆ సమయంలోనే కెప్టెన్ అమెరికా ఆఫర్ రాగా దాన్ని నిరాకరించినట్లు కూడా స్పష్టం చేశాడు.

    కానీ, సినిమా నిర్మాణ సంస్థ పట్టుబట్టడంతో, తన మానసిక వైద్యుడి సలహాతోపాటూ, కుటుంబం, తన కో -స్టార్, ఐరన్ మ్యాన్ పాత్రధారి అయిన రోబర్ట్ డౌనీ జూనియర్ తో మాట్లాడి వారి సూచనల మేరకే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఆ తరువాత జరిగిందంతా హాలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయనానికి తెరలేపిందని ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదు.

    English summary
    The first ever Avenger Chris Evans went down memory lane and revelead some interesting facts of his life. He went on to say that he was almost on verge of giving up on Captain America, as he was suffering from Severe anxiety disorder back then.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X