కెప్టెన్ అమెరికా వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ ప్రకటించిన మార్వెల్ స్టూడియో
హాలీవుడ్‌లోనే కాకుండా ఇండియాలో కూడా కెప్టెన్ అమెరికా సిరీస్‌లకు భారీగా అభిమానులు ఉన్నారు. అలాంటి అభిమానుల కోసం మార్వెల్ స్టూడియో మరో సిరీస్ కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ (Captain America: Brave New World) త్వరలోనే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. ఈ సినిమా గురించి, టీజర్ గురించిన వివరాల్లోకి వెళితే..
మార్వెల్ కామిక్ క్యారెక్టర్ సామ్ విల్సన్ (కెప్టెన్ అమెరికా) నేపథ్యంగా రూపొందిన ఈ సినిమాను మార్వెల్ స్టూడియోస్ నిర్మిసున్నది. ఈ సినిమాకు జూలియస్ ఓనా దర్శకత్వం వహిస్తున్నారు. కెవిన్ ఫీజ్, నేట్ మూర్ నిర్మిస్తున్నారు. ఆంథోని మాకీ, డానీ రామిరేజ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

కెప్టెన్ అమెరికా సిరీస్‌లో వస్తున్న నాలుగో సిరీస్. ఈ సినిమాలో అమెరికా ప్రసిడెంట్ థాడెస్ రాస్‌గా హారిసన్ ఫోర్డ్ నటిస్తున్నారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఆయన నటించడం తొలిసారి. ఓ ఇంటర్నేషనల్ సమస్యలో సామ్ ఇరుక్కోవడం, ఆయన అమెరికా ప్రసిడెంట్‌తో మాట్లాడటం తర్వాత జరిగే పరిణమాల బ్యాక్ డ్రాప్‌గా సినిమా తెరకెక్కింది. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల చేయగా మంచి రెస్సాన్ వస్తున్నది.

ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేయడానికి వాల్ట్ డిస్నీ స్టూడియోస్, మోషన్ పిక్చర్స్ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ టీజర్‌పై ఓ లుక్ మీరు వేయండి..


Click it and Unblock the Notifications











