ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కెప్టెన్ మార్వెల్’ ట్రైలర్
మార్కెల్ కామిక్స్ ఆధారంగా హిలీవుడ్ నుంచి వస్తున్న మరో భారీ యాక్షన్ మూవీ 'కెప్టెన్ మార్వెల్'. ఇప్పటి వరకు మార్వెల్ సంస్థ నుంచి పలు అవెంజర్స్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే ఈ చిత్రం ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఒక సరికొత్త పాత్రతో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతోంది.
తాజాగా విడుదలైన 'కెప్టెన్ మార్వెల్' ట్రైలర్ హాలీవుడ్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారిలో మరింత ఆసక్తిని పెంచింది. ఈ చిత్రంలో ఆస్కార్ విన్నర్ బ్రీ లార్సన్ టైటిల్ రోల్ పోషిస్తోంది. ట్రైలర్లో ఆమె చేసిన యాక్షన్ స్టంట్స్, ఆమెలోని కిల్లర్ కాన్ఫిడెన్స్ మార్వెల్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో బ్రీ లార్సన్.. కెరోల్ డాన్‌వర్స్ అనే పాత్రలో కనిపించబోతోంది. ఆమెకు అతీత శక్తులు ఎలా వచ్చాయి, కెప్టెన్ మార్వెల్‌గా ఎలా మారింది. ఆమె గతం ఏమిటి? అనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించబోతున్నారు.

అన్నా బోడెన్, రేయాన్ ఫ్లెక్‌లు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 152 మిలియన్ డాలర్ల ఖర్చుతో మార్వెల్ స్టూడియో నిర్మించింది. బ్రీ లార్సన్‌తో పాటు శామ్యూల్ ఎల్. జాక్స్, బెన్ మెడిల్సన్, డిజిమాన్ హౌన్స్, లీ పేస్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇండియాలో ఈ చిత్రం మార్చి 8, 2019లో విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











