twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ది హీట్' సినిమా సెట్ ప్రమాదంలో పదకొండు మందికి గాయాలు

    By Nageswara Rao
    |

    బోస్టన్, జులై 10: ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్ సాంద్రా బుల్లక్ నటిస్తున్న కొత్త సినిమా 'ది హీట్' సినిమా సెట్స్‌లో బస్సు ఢీ కొట్టడంతో సుమారు పదకొండు మంది గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదం సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఉన్న వార్రెన్ అవెన్యూ లోని రాక్స్‌బురే మున్సిపల్ కోర్టు హౌస్ సమీపంలో జరిగింది.

    'ది హీట్' సినిమా షూటింగ్ సెట్‌ ట్రైలర్‌లోకి ఒక సిటీ బస్ దూసుకురావడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గాయాలు పాలైన వారిని దగ్గరలో ఉన్న హాస్పిటల్‌లో చేర్పించారు. ఐతే ఎవరికీ ప్రాణపాయం లేదని చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి పాల్ ఫెయిగ్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ విషయానికి వస్తే ఒక ఎఫ్‌బీఐ ఏజెంట్ స్దానికి పోలీసులతో కలసి జట్టుగా రష్యన్ దోపిడిదొంగను ఏవిధంగా పట్టుకుంటారనేది ముఖ్యాంశంగా సాగుతుంది.

    ఈ సినిమాలో ఎఫ్‌బీఐ ఏజెంట్ పాత్రను సాంద్రా బుల్లక్ పోషిస్తున్నారు. సాంద్రా బుల్లక్ తాను చేసిన దాతృత్వ కార్యక్రమాలకు గాను ఆమెని సన్మానించనున్నారు. వారెన్ ఈసన్ చార్టర్ హైస్కూల్‌తో పాటు.. 2005వ సంవత్సరంలో హరికేన్ కత్రినా నాశనానికిగాను ఆమె అందించిన విరాళాలను దృష్టిలో పెట్టుకోని 2012వ సంవత్సరానికి 'వారెన్ ఈసన్ హాల్ ఆప్ ఫేమ్' గా సాంద్రా బుల్లక్ ఎంపిక చేయబడింది.

    సహజ విపత్తు సంభవించినప్పటి నుండి సాంద్రా బుల్లక్ విద్యా స్థాపనతో చురుగ్గా పాల్గోని స్వచ్ఛంద ప్రాజెక్టులలో తన వంతు సహాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం సాంద్రా బుల్లక్ విద్యా సంస్దలకు గాను స్కాలర్ షిప్‌ల నిమిత్తం $25,000 విరాళంగా అందించారు.

    తెలుగు వన్ఇండియా

    English summary
    
 Eleven people were injured in a bus collision on the sets of Sandra Bullock’s upcoming film “The Heat”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X