ఆ మాజీ సూపర్ స్టార్ కి 'గే'అని పిలిపించుకోవటం చాలా ఇష్టం
ఆఫ్ ఫుల్ ట్రూత్,బ్రింగింగ్ అప్ బేబి వంటి ఎన్నో అద్బుతమైన హాలీవుడ్ సినిమాల్లో నటించిన అలనాటి సూపర్ స్టార్ క్యారీ గ్రాంట్ ని గే అని అప్పట్లో రూమర్స్ వచ్చేవి.అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అయితే తనను గే అని పిలవటం ఆయన చాలా ఎంజాయ్ చేసేవాడిని వారిపై కోపగించుకునేవాడు కాదని ఆయన కూతురు జెన్నిఫర్ రీసెంట్ గా రాసుకొచ్చింది.ఆమె గుడ్ స్టఫ్..ఎ రిమ్మీన్ సెస్ ఆఫ్ మై ఫాధర్..క్యారీ గ్రాంట్ అనే పుస్తకం రాసింది. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ కి ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయం ప్రస్దావనకొచ్చింది.ఆమె మాట్లాడుతూ..ఆయన్ని మగవాళ్ళు సైతం కోరుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు.ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అంత అద్బుతంగా ఉండేది.ఆయన వద్ద ఈ విషయం మాట్లాడితే నవ్వేసి..అవును నేను గే ను కాదు అని ఆడవాళ్ళ దగ్గర నిరూపించుకునేందుకు వెళ్తున్నట్లుగా చెప్పి వారికి దగ్గరయ్యేందుకు ఇదో సాధనం అనేవారు అంటూ రాసుకొచ్చింది.ఆ పుస్తకంలో క్యారీ గ్రాంట్ కి చెందిన ఇప్పటిదాకా వెలుగు చూడని అనేక ఫోటోలు ఉన్నాయి.ఆ పుస్తకం ఆయన అభిమానులుకు పండుగ లాంటిదని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.


Click it and Unblock the Notifications











