twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మాయిలను పట్టడం కోసమే ఈ కాస్టింగ్ కాల్

    By Srikanya
    |

    లాస్ ఏంజిల్స్: సినీ పరిశ్రమలో జరిగే కొన్ని మోసాలను అప్పడప్పుడూ చిత్రాలు తమ కథల్లో చొప్పిస్తూ వస్తూ ఉన్నాయి. తాజాగా హాలీవుడ్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న కాస్టింగ్ కాల్ అనే చిత్రం ఆడిషన్ పేరుతో జరిగే మోసాలపై కామెడీ చిత్రంగా తెరకెక్కించారు. అమ్మాయిలను పట్టాలనుకునే వారు కాస్టింగ్ కాల్ అని ఇచ్చి ఎలా ఫేక్ ఆడిషన్ చేస్తారనేది కథాంశంగా చిత్రం రూపొంది, విడుదలకు సిద్దమైంది.

    మార్చి 12న విడుదల అవుతున్న ఈ చిత్రంలో కొత్త అమ్మాయిలను, అదీ అందగత్తెలను పరిచయం చేసుకోవాలనే ఆసక్తితో ఆరుగురు కుర్రాళ్లు ఓ ప్లాన్ చేస్తారు. అది.. ఓ ఫేక్ మూవీ. అందుకోసం నటీనటుల ప్రకటన ఇస్తారు. అక్కడ నుంచి కామెడీ మొదలవుతుంది. రకరకాల పాత్రలు సినిమా మీద వ్యామోహంతో అక్కడకి వస్తాయి. వారిలో ఆరుగురు అందగత్తెలను ఎంచుకోవాలని హీరో, టీమ్ ప్రయత్నిస్తూంటుంది. ఈ క్రమలో ఆ స్కామ్ లో ఏం జరిగింది. అది ఎటువంటి మలుపు తిరిగింది అనేది మిగతా కథ.

    ఈ చిత్రం పూర్తి కామెడీగా ఉంటుందని దర్శకుడు జాసన్ లాక్ హార్ట్ హామీ ఇస్తున్నారు. థియోటర్ లో కూర్చున్న వారిని గంటన్నర సేపు నవ్వించే పూచీ తనది అంటున్నారు. సిని పరిశ్రమలో కాస్టింగ్ కాల్స్ పేరుతో జరిగే మోసాలను ఇది బట్టబయిలు చేస్తుందని, ఇది చూసాక కొంతమందైనా జాగ్రత్తపడతారని అనుకుంటున్నామని దర్శక, నిర్మాతలు చెప్తున్నారు.

    English summary
    Casting Couch (2013) film concept...Desperate to meet new girls, six down-on-their-luck guys come up with the ultimate plan to hook up - cast a fake movie. When tons of hot chicks show up for the audition, it's a matter of who's willing to go the farthest to get the part! Packed with enough crude humor and sexy girls for a dozen movies, Casting Couch is a hilarious scam that's about to get real!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X