ఆ బాధను చూసి తట్టుకోలేకపోయాను..!
హాలీవుడ్ లో తన కంటూ ఒక ప్రత్యేకమైన స్తానాన్ని సంపాదించుకున్న మైఖెల్ డగ్లాస్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దానికి కారణం ఆయన కున్న గోంతు క్యాన్సరే అని సమాచారం. మైఖెల్ డగ్లాస్ ప్రస్తుతం ఆసుపత్రిలో గోంతు క్యాన్సర్ తో బాధపడుతున్న తీరును చూసి ఆయన భార్య జీటా జోన్స్ చలించిపోయింది. అంతే కాకుండా ఆయన జీవితంలో ఇటువంటి బాధను ఇంతకముందు ఎన్నడూ ఆయన అనుభవించలేదు అని తన ఆవేదనను వెల్లడించారు.
ప్రస్తుతం మైఖెల్ డగ్లాస్ గోంతు క్యాన్సర్ తో బాధపడుతున్నారని, ఆయనను ఎనిమిది వారాల నుండి ఐసియులో వుంచి కెమెథెరపీ మరియు రేడియేషన్ ట్రీట్ మెంట్ యిస్తున్నామని, అంతేకాకుండా ప్రస్తుతం ఆయన క్యాన్సర్ అడ్వాన్స్ డ్ స్టేజిలో ఉందని, దానిని అదిగమించడం పెద్ద కష్టం ఏమి కాదని, త్వరలోనే ఆయన కోలుకుంటారని డాక్టర్స్ అన్నారు. మైఖెల్ డగ్లాస్ ఆసుపత్రిలో చేరకముందు గోంతు క్యాన్సర్ ని అధిగమించడం అనేది నిజంగా పెద్ద ఫైట్ అని వెల్లడించారు. మైఖెల్ డగ్లాస్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మైఖెల్ డగ్లాస్ తన జీవితంలో మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, రెండు అకాడమి అవార్డులు మరియు బెస్ట్ యాక్టర్ అవార్డును 'వాల్ స్ట్రీట్ 'చిత్రానికి తీసుకున్నారు. అలాగే ఒక ఎయఫ్ఐ'లైఫ్ అచీవ్ మెంట్'ని 2009లో తీసుకున్నారు.


Click it and Unblock the Notifications











