హీరోయిన్‌తో యాంకర్ అసభ్యంగా.. కోలుకోలేని దెబ్బ, 68 కోట్ల లాస్!
చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపులని మౌనంగానే భరిస్తున్న ఎంతో మంది నటీమణులకు మీటూ ఉద్యమం ఆయుధంలా మారింది. తమకు జరిగిన వేధింపులని నటీమణులులు వరుసగా మీటూ వేదికగా పంచుకుంటున్నారు. దీనోతో ఆయా నటులు, దర్శకులు, నిర్మాతల జాతకాలు మారిపోతున్నాడు. పబ్లిక్ లో వారి పరువు పోతోంది. ప్రముఖ హాలీవుడ్ నటి ఎలిజా దుష్కు మీటూ ఆరోపణలు చేయడమే కాదు ఒంటరిగా న్యాయపోరాటం చేసి నెగ్గింది. దీనితో ఆమెకు భారీ మొత్తంలో నష్టపరిహారం లభించింది.

హాలీవుడ్ చిత్రాలు
ఎలిజా హాలీవుడ్ లో ఉన్న అద్భుతమైన నటీమణులలో ఒకరు. కేవలం సినిమాలు మాత్రమే కాక టెలివిజన్ షోలలో కూడా ఎలిజాకు మంచి క్రేజ్ ఉంది. అమెరికాలోని ప్రముఖ సీబీఎస్ సంస్థ నిర్వహిస్తున్న ఓ టెలివిజన్ సిరీస్ లో ఎలిజా చాలా కాలంగా నటిస్తోంది. ఆ మధ్యన సీబీఎస్ నెట్వర్క్ కు చెందిన ప్రముఖ యాంకర్ చార్లీ రోస్ పై లైంగిక ఆరోపణలు చేసింది. ఆమె చైనా వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపాయి.

అసభ్యంగా మాటలు
ఎలిజాని కలిసిన ప్రతి సారి అతడి చాలా అసభ్యంగా మాట్లాడేవాడట. ఎప్పుడు శృంగారం గురించి ప్రస్తావిస్తూ ఎలిజా వద్ద చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసేవాడని ప్రచారం జరిగింది. అతడు అలాంటి వాడే అంతో ఎలిజా నోరు విప్పడంతో హాట్ టాపిక్ గామారింది. తాను నటిస్తున్న సంస్థకు చెంసిన అఫీషియల్ పైనే ఎలిజా మీటూ వ్యాఖ్యలు చేయడంతో ఆమెని టివి షో నుంచి తొలగించారు. దీనితో సీబీఎస్ నెట్వర్క్ పైనే ఎలిజా ఒంటరిగా న్యాయపోరాటానికి దిగింది.

కోలుకోలేని దెబ్బ
వెనకడుగు వేయకుండా ఎలిజా న్యాయస్థానంలో పోరాటం చేయడంతో సీబీఎస్ సంస్థకు కోలుకోలేని దెబ్బ తలిగింది. ఎలిజాని సరైన కారణం లేకుండా టివి షో నుంచి తొలగించడంతో ఆమెకు 68 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. హాలీవుడ్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రతి ఒక్కరూ ఎలిజాని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

మీటూకు మరింత బలం
ఎలిజా నటిస్తున్న ఆ టివి షో పేరు బుల్. అమెరికన్లలో ఈ షోకు మంచి క్రేజ్ నెలకొని ఉంది. ఎలిజాని తప్పించడంతో ఆమె అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. ఏది ఏమైనా న్యాయస్థానం తాజా తీర్పుతో మీటూ ఉద్యమానికి మరింత బలం చేకూరిందని అంటున్నారు. నటీమణులని వేధిస్తే ఎంతటి బలం ఉన్న అధినేతలైనా చిక్కుల్లో పడక తప్పదని హాలీవుడ్ ప్రముఖులు అంటున్నారు. హాలీవుడ్ లో మొదలైన మీటూ ఉద్యమం బాలీవుడ్ కు, దక్షణాది చిత్ర పరిశ్రమకు కూడా పాకిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











