జంతువుల సంరక్షణ కోసం నగ్నంగా నిలబడిన సెలబ్రిటీలు..!!
జంతువుల సంరక్షణార్థం పెటా వారు విడుదల చేసే ప్రకటనలు ఎప్పుడూ వైవిధ్యంగా వుంటాయి. ఇటీవలే విడుదల చేసిన ఓ ప్రకటనలో ఓ మోడల్ నగ్నంగా నిలబడి చేతిలో సిలువ పూని జంతువుల పాలిట మీరొక ఏంజిల్ లాగా వుండండి అంటూ వచ్చిన ఓ ప్రకటన వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు అలాంటి ఓ ప్రకటనే వెలువడింది.
ఇందులో మన అందం కోసం జంతువుల చర్మంతో చేసిన దుస్తులను ధరిస్తుంటాము. అది సరికాదు. వాటి చర్మాన్ని మన స్వార్థం కోసం ఉపయోగించడం మంచిది కాదు. పుట్టినప్పుడు ఏమీ లేకుండా పుడతాము, పోయేప్పుడు ఏమీ లేకుండా పోతాము, మరి మధ్యలో ఈ అనవసర షోకుల కోసం జంతువులను హింసించకండి అంటూ ఓ మంచి సందేశాన్ని ఇచ్చే ఈ ప్రకటనకు మంచి ప్రచారాన్ని కల్పించేందుకు టాప్ పాప్ తారలు నడుం బిగించారు. దీని కోసం వారు నగ్నంగా నిలబడి మరీ ప్రచారాన్ని కల్పించారు.
పాప్ తారలు డానిటీ కేన్, షాన్నోన్ బెక్స్, డావ్న్ రిచర్డ్స్, ఆండ్రియా ఫింబ్రెస్ తదితరులు కలసి నగ్నంగా నిలబడి జంతువుల చర్మం ధరించినంత మాత్రానా మనమేమీ అందంగా కనిపించము, అవి లేకుండా కూడా అందంగా కనిపించవచ్చు అని చెప్పకనే చెప్పారు. ఓ మంచి పని కోసం వీరంతా తమ వంతు సాయం అందించడం అభినందించతగ్గవిషయం...!!


Click it and Unblock the Notifications











