వామ్మో.. అన్ని జతల 'షూస్'....!!
పిచ్చి అనేది పలు రకాలు. కొంత మందికి కార్ల పిచ్చి. మరికొంత మందికి బంగారం పిచ్చి. ఐతే హాలీవుడ్ సింగర్ సెలిన్ డియోన్‌కి 'షూస్' పిచ్చి. మనుషులు సాధారణంగా ఆల్కహాల్‌కి బానిసలు అవుతుంటారు. కానీ నే చెప్పేది వింటే సమాజంలో ఇలాంటి వారు కూడా ఉంటారా అన్న ప్రశ్న మీకు తలెత్తుంది. సెలిన్ డియోన్ వద్ద పలు రకాల కంపెనీలకు చెందిన షూస్ సుమారుగా 3,000 జతలు వరకు ఉన్నట్లు సమాచారం. 43 సంవత్సరాల వయసు కలిగిన ఈ సింగర్ దేన్నైనా కోరుకుంటే క్షణాల్లో సొంతం చేసుకొవాలనుకునే భావన ఈమె సొంతం.
ఇటీవల ఓ ప్రముఖ ఇంటర్యూలో సెలిన్ డియోన్ మాట్లాడుతూ ఎవరి దగ్గరైనా 600 జతల షూస్ ఉంటే వారిని షూస్ బానిసలుగా భావిస్తారు. కానీ నా వద్ద మాత్రం 3,000 జతల షూస్ ఉన్నాయని తెలిపారు. దాంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. తన వద్ద 3,000 జతల షూస్ ఉన్న విషయాన్ని కూడా సమర్దించుకున్నారు. కొంత మంది సెలబ్రిటీలు డబ్బు ఉంటే డ్రగ్స్ కొనుకుంటారు. కానీ నేను మాత్రం షూస్ కొనుకుంటానని అన్నారు.


Click it and Unblock the Notifications