తాగిన మత్తులో కండోమ్ మరిచిన స్టార్, హెచ్ఐవికి అదే కారణమేమో?

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్: ప్రముఖ హాలీవుడ్ నటుడు ప్రాణాంతక హెచ్ఐవి బారిన పడ్డాడంటూ అప్పట్లో హాలీవుడ్ సర్కిల్ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. హాలీవుడ్లో ప్లే బాయ్ గా పేరున్న ఆ నటుడు ఈ ప్రచారంతో మీడియా ముందు వచ్చి నిజం ఒప్పుకోక తప్పలేదు. హాలీవుడ్ నటుడు చార్లీ షీన్ తానే స్వయంగా టీవీ షోలో విషయం ఒప్పుకున్నాడు. తనకు నాలుగేళ్ల క్రితమే ఎయిడ్స్ ఉందని నిర్దారణ అయిందని, తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకుని నిజాయితీగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తెలిపారు.

అయితే తాజాగా 'ది సన్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాలుగేళ్ల క్రితం తాను తాగిన మత్తులో చేసిన తప్పే హెచ్ఐవి బారిన పడటానికి కారణం అయి ఉండొచ్చని చార్లీ షీన్ అభిప్రాయ పడ్డారు. విషయం తెలిసినప్పటి నుండి తాను చికిత్స పొందుతున్నానని, గతంలో తాను తాగిన మత్తులో కండోమ్ మచిచానని... ఆ సమయంలోనే వైరస తనకు వ్యాపించి ఉండొచ్చని అభిప్రాయ పడ్డారు.

Charlie Sheen admits he caught HIV after only two instances of unprotected sex

తరచుగా కండోమ్స్ యాడ్స్, హెచ్ఐవి మీద అవగాహన కల్పించే కార్యక్రమాల్లో కనిపించే చార్లీ షీన్ తాను దురదృష్టవంతుడినని చెప్పుకొచ్చారు. హెచ్ఐవి సోకిన విషయం తెలిసిన తర్వాత కొన్ని నెలల నుండి సెక్స్ లో పాల్గొనడం లేదని, కొన్ని సార్లు పాల్గొన్నా తగిన జాగ్రత్తలు తీసుకుని నిజాయితీగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. తాను ఎవరికీ వైరస్ అంటించలేదని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు చార్లీ షీన్.

నాలుగేళ్ల పాటు ఈ రహస్యాన్ని దాచడానికి, విషయం బయట పెడతానని తనను బ్లాక్ మెయిల్ చేసిన వారికి రూ. 66 కోట్ల వరకు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఉద్దేశ్య పూర్వకంగానే ఇతరులకు హెచ్ఐవి అంటించాడని, తనకు గల వ్యాధి వివరాలను దాచి లైంగిక సంబంధాలు కొనసాగించాడని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. అయితే అతనితో గడిపిన మాజీ పోర్న్ స్టార్ బ్రీ ఓల్సన్... చార్లీ షీన్ తనతో ఎప్పుడూ హెచ్ఐవి ఉందన్న విషయం చెప్పలేదని, ఐయామ్ క్లీన్ అని చెప్పేవాడని, ఉద్దేశ్య పూర్వకంగానే అతడు విషయాన్ని దాచాడని మీడియాకు చెప్పడంతో... చార్లీ షీన్ విషయం వెలుగులోకి వచ్చింది. టెస్టుల్లో తనకు హెచ్ఐవి నెగెటివ్ అని వచ్చిందని ఆమె వెల్లడించింది. అయితే ఆమె ఆరోపణలను చార్లీ షీన్ ఖండించారు. ఆమెతో విడిపోయే నాటికి హెచ్ఐవి ఉందనే విషయం నాకు కూడా తెలియదని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X