డ్రగ్స్ తీసుకోవడం వల్ల బంగారపు దంతాలను అమర్చుకోవాల్సి వచ్చింది..
హాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు చార్లీ షీన్. మేజర్ లీగ్ మరియు హాట్ షాట్స్ సినిమాల ద్వారా తనలోని కామెడీని బయటకు తీశారు. సమాజంలో ఓ మంచి హొదా వచ్చిన తర్వాత చాలా మంది డ్రగ్స్ లాంటి మహామ్మారిలకు బలి అవుతూ ఉంటారు. సరిగ్గా ఇలాంటిదే చార్లీ షీన్ జీవితంలో కూడా జరిగింది. మితిమీరినటువంటి డ్రగ్స్ తీసుకోవడం వల్ల చార్లీ షీన్ తనకున్నటువంటి దంతాలను కొల్పోవాల్సి వచ్చింది. తర్వాత బంగారపు దంతాలను అమర్చుకోవడం జరిగింది.
ఇరవై రెండు సంవత్సారాల వయసులోనే ఈడ్రగ్స్‌కి అలవాటు పడినటుంటి చార్లీ షీన్ డ్రగ్స్ నుండి బయటకు రావడానికి చాలా ప్రయత్నించాడు కానీ వాటినుండి బయటకు రాలేకపోయాడని తన స్నేహితుడు జోర్డాన్ వెల్లడించారు. ఈసందర్బంలో జోర్డాన్ మాట్లాడుతూ గతంలో కూడా చార్లీ షీన్ నేను పార్టీకి వెళ్శినప్పుడు చార్లీ షీన్ ఎక్కువగా తాగడం వల్ల దంతాలు ఒక్కసారిగా క్రింద పడిపోయాయి. ఇలా జరగడానికి కారణం తను యవ్వన వయసు నుండే డ్రగ్స్ మితిమీరి తీసుకోవడం అని అన్నారు.
గతంలో కూడా చార్లీ షీన్ బాగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల అతని తన శరీరం మీద పట్టుని కోల్పోయాడంటూ వార్తలు రావడం, అంతేకాకుండా ఇలా డ్రగ్స్ తీసుకోవడం వల్లనే తనని హాస్పిటల్ కుతీసుకోనిరావడం జరగిందని తన సన్నిహితులు చెప్తున్నారు. ఈ వార్త తెలిసినటువంటి న్యూయార్క్ సిటి పోలీసులు చార్లి షీన్ హాస్పిటల్ లోచేరక ముందు బస చేసినటువంటి హోటల్ పైన అర్దరాత్రి రెండు గంటలు సమయంలో అతని రూమ్ పైరైడ్ చేయడం జరిగిన విషయం మనకు తెలిసిందే. డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చార్లీ షీన్ రిహాబ్‌కు తరలించడం జరిగింది.


Click it and Unblock the Notifications











