»   » హెచ్ఐవి సోకిన్ ఆ స్టార్ ఎవరో బట్టబయలైంది!

హెచ్ఐవి సోకిన్ ఆ స్టార్ ఎవరో బట్టబయలైంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ప్రముఖ హాలీవుడ్ నటుడు ప్రాణాంతక హెచ్ఐవి బారిన పడ్డాడంటూ గత కొంత కాలంగా హీలీవుడ్ సర్కిల్ లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ అతడికి హాలీవుడ్ సర్కిల్ లో ప్లేబాయ్ గా పేరుంది. పలువురు హీరోయిన్లు, పోర్న్ స్టార్లతో లైంగిక సంబంధాలు ఉండటంతో వారికి కూడా హెచ్ఐవి సోకి ఉంటుందనే విషయం అందరినీ హడలెత్తించింది. అయితే అతని పేరు మాత్రం బయటకు రాలేదు.

తాజాగా అతని పేరు బయటకు వచ్చింది. అతను మరెవరో కాదు ప్రముఖ హాలీవుడ్ నటుడు ‘చార్లీ షీన్' అంటూ పలు హాలీవుడ్ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. అంతే కాకుండా నేడు (నవంబర్ 17వ) తేదీ రాత్రి ఓ టీవీ షోలో తన విషయం ఆయనే స్వయంగా బయట పెట్టబోతున్నాడని తెలుస్తోంది.

Charlie Sheen To Reveal He Is HIV Positive, On The 'Tonight' show?

ఈ విషయం బయటకు పొక్కగానే అందరి కళ్లు హాలీవుడ్ డర్టీ ప్లేబాయ్ గా పేరొందిన వ్యక్తి వైపుకు మళ్లాయి. అతనికి సినీ ఇండస్ట్రీలో పలువురు నటీమణులతో పాటు, పోర్న్ ఇండస్ట్రీలోకి సెక్స్ భామలతో లైంగిక సంబంధాలు ఉండటమే ఇందుకు కారణం. అతనితో సంబంధాలు ఉన్న వారంతా వెంటనే హెచ్ఐవి టెస్టులు చేయించుకోవడం మొదలు పెట్టారు.

Charlie Sheen To Reveal He Is HIV Positive, On The 'Tonight' show?

15 రోజుల పాటు ఆ మిస్టరీ వ్యక్తి ఎవరనే విషయం వార్తల్లో నలిగింది. ఎట్టకేలకు అతడు చార్లీ షీన్ అనే విషయం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ మాలీవుడ్ వార్త సంస్థలు యూఎస్ఏ టుడే, టిఎంజెడ్, హాలీవుడ్ రిపోర్టర్ ఈ విషయాన్ని స్వయంగా బయట పెట్టాయి. ఈ టాపిక్ ట్విట్టర్ తో పాటు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ట్రెండింగ్ అయిపోయింది.

Charlie Sheen To Reveal He Is HIV Positive, On The 'Tonight' show?

ఆ స్టార్ హీరోతో లైంగిక సంబంధం కలిగి ఉన్న ఓ పోర్న్ స్టార్ మీడియాతో మాట్లాడుతూ...అతడికి దాదాపు 50 మందితో లైంగిక సంబంధాలు ఉన్నాయని, వారిలో ఐదుగరు పోర్న్ స్టార్లు, ఓ టీవీ షో ప్రజెంటర్, ప్రముఖ మీడియా జర్నలిస్టు కూడా ఉన్నారని తెలిపింది. అతని ద్వారా గతంలో తనకు గర్భం వచ్చింది, అబార్షన్ కూడా చేయించుకున్నానని, హెచ్ఐవి టెస్టు చేయించుకోగా తనకు సోకలేదని తేలిందని తెలిపింది.

English summary
The speculations regarding the playboy of Hollywood who is carrying the deadliest virus HIV, seems to have come to an end. The 'Two And A Half Men' actor is supposedly going to reveal on the 'Tonight' show that he's being treated for HIV positive. According to the TMZ reports, Charlie is going to appear on the 'Tonight' show on Tuesday, November 17, 2015 and make a "revealing personal announcement". The news about the mystery man in Hollywood with HIV positive, was first out on November 2, 2015.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu