»   » ఆ హీరోకు ఎయిడ్స్‌ .. అయినా సహజీవనం.. వదలను అంటున్న బ్యూటీ..

ఆ హీరోకు ఎయిడ్స్‌ .. అయినా సహజీవనం.. వదలను అంటున్న బ్యూటీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  పక్కన ఎవరైనా ఎయిడ్స్ వ్యాధికి గురైనారంటేనే దూరంగా ఉంటాం. అలాంటిది తన ప్రియుడు భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడని తెలిస్తే కచ్చితంగా వదిలేయడం ఖాయం. కానీ ఓ ముద్దుగుమ్మ మాత్రం ఎయిడ్స్ ఉంటే నాకేం భయం అంటూ అతనితో సహజీవనం చేస్తున్నది. ఈ కథ ఎవరిదంటే.. హలీవుడ్‌ నటుడు చార్లీ షీన్, అతని గర్ల్ ఫ్రెండ్ జూలియా స్టంబ్లర్‌ది. స్నేహితులు వారించినా తన భాయ్ ఫ్రెండ్‌ను వదిలే ప్రస్తక్తి లేదని చెప్తున్నది. చార్లీ షీన్ యాంగర్ మేనేజ్ మెంట్ చిత్రం ద్వారా హాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులు. జూలియాకు పాపులర్‌ మోడల్‌గా గుర్తింపు ఉంది.

  ఆయనకు 51.. ఆమెకు 26..

  ఆయనకు 51.. ఆమెకు 26..

  హాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న నటుడు చార్లీ షీన్‌ వయస్సు 51 సంవత్సరాలు. ప్రస్తుతం ఆయన జూలియా స్టంబర్ వయస్సు 26 సంవత్సరాలు. గత రెండేడ్లుగా వీరిద్దరూ ప్రేమయాణంలో మునిగి తేలుతున్నారు. 2015లో చార్లీ షీన్‌కు ఎయిడ్స్ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి చార్లీని వదిలేయమని సన్నిహితులు పోరు పెట్టిన వదలను అని చెప్తూ నాకేం భయం లేదు అని స్పష్టం చేస్తున్నదీ బ్యూటీ.

  నాకు ఎయిడ్స్ ఉంది..

  నాకు ఎయిడ్స్ ఉంది..

  తనకు ఎయిడ్స్ వ్యాధి సోకినట్టు వైద్యులు వెల్లడించగానే ఆ విషయాన్ని రేడియో కార్యక్రమంలో చార్లీ షీన్ ప్రకటించడం సంచలనం రేపింది. చార్లీ షీన్ ఏకంగా తనపైనే జోక్‌లు వేసుకోవడం గమనార్హం. ఇక సెక్స్ లైఫ్ లేకుండా నేనెలా బతికేది అని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఎయిడ్స్ తర్వాత సెక్స్ లైఫ్ ఎలా ఉంది అని ఎవరైనా అడిగితే.. ఇప్పుడు ఇక దేనికి భయపడాల్సింది లేదు. సెక్స్ జీవితం చాలా జోరుగా సాగుతున్నది అని బదులిస్తున్నాడట.

  ఇప్పటికే ఇద్దరికి విడాకులు

  ఇప్పటికే ఇద్దరికి విడాకులు

  గతంలో చార్లీ షీన్‌కు ఇద్దరిని వివాహం చేసుకొన్నాడు. బ్రూక్ ముల్లర్ అనే నటితో విడాకులు తీసుకొన్న తర్వాత డెనీస్ రిచర్డ్స్ అనే ఆమెను పెళ్లి చేసుకొన్నాడు. ఇటీవల డెనీస్‌తో కలిగిన సంతానం సామ్ జన్మదిన వేడుకకు జూలియాతో కలిసి హాజరయ్యాడు. ఆ సందర్భంగా జూలియాను తన మాజీ భార్యకు పరిచయం చేసినట్టు తెలుస్తున్నది.

  నాకేం కాదు.. ధీమాలో చార్లీ షీన్

  నాకేం కాదు.. ధీమాలో చార్లీ షీన్

  అలాగే మరో మాజీ భార్య బ్రూక్ ముల్లర్‌తో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. వారికి వల్ల కలిగిన ఇద్దరు పిల్లలతో సంబంధాలు బాగున్నాయి. ప్రస్తుతం సహజీవనం చేస్తున్న జూలియాతోనే కాలం వెళ్లదీస్తున్నాడు. ఎయిడ్స్ చికిత్సకు సంబంధించి వైద్య సదుపాయాలు మెరుగుపడ్డాయి. దాని వల్ల తనకు ఏమీ కాదు అనే ధీమాతో చార్లీ షీన్ ఉన్నట్టు తెలుస్తున్నది.

  English summary
  Charlie Sheen's new girlfriend Julia Stambler, 26, 'isn't living in fear of the actor's HIV'... after being left hurt by her friends' stark warnings. She is currently in the throes of a new romance with the Two And A Half Men star. And it appears Julia Stambler, 26, is standing by her man, despite friends encouraging her not to pursue a relationship with Charlie Sheen, 51, because of his diagnosis.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more