»   » అక్టోబర్ 26న యావత్ ప్రపంచం ఆ వీడియో దుమ్ము రేపుతుంది..!

అక్టోబర్ 26న యావత్ ప్రపంచం ఆ వీడియో దుమ్ము రేపుతుంది..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ రాసీ సింగర్ మరియు పెళ్శికూతురు కాబోతున్న మన అందాల ముద్దుగుమ్మ కాటిపెర్రి త్వరలోతాను విడుదల చేయనున్న 'ఫైర్ వర్కు' ఆల్బమ్ లో ఇరగదీశారని కాటిపెర్రి అభిమానులు కోడైకూస్తున్నారు. బ్రహ్మాండమైన ఈ వీడియో ఇటీవలే తన ఆర్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసుకోని మార్కెట్ లోకి అక్టోబర్ 26న రావడానికి సిద్దంగా ఉంది. ఇక ఈ వీడియో విషయానికి వస్తే చాలా బ్రహ్మాండం గా వచ్చిందని కాటిపెర్రి వివరించారు. ఈ వీడియో ఆల్బమ్ కి తగ్గట్టుగానే ఓ స్పార్క్ కాటిపేర్రి పేరునుండి ఫైర్ వర్కు అనే పేరు మీదకి వస్తూ ఉంటుంది. అలా వస్తున్న ఆ స్పార్క్ ని కాటిపెర్రి అమాంతం మింగేసేదానిలాగా చూడడం చాలా చక్కాగా ఉందని ఆమె అభిమానులు అంటున్నారు.

గతంలో 'కాలిఫోర్నయా గర్ల్స్' మాదిరే యావత్ ప్రపంచం మొత్తాన్ని ఈ వీడియో దుమ్ము లేపుతుందనడంలో సందేహాం లేదంటున్నారు. ఈ వీడియోతో మరలా కాటిపేర్రి 'బిల్ బోర్డ్ టాప్ 20'లోకి ప్రవేశిస్తుందంటున్నారు ఆమె అభిమానులు. కాటిపేర్రి ఈ సాంగ్ లో చాలా ప్రతిభ కనపరిచారని సినీ విశ్లేషకులు అంటున్నారు. వచ్చే నెలలో జరగనున్న వీరి పెళ్శి అంగరంగ వైభవంగా చేయడానికి నిర్ణయించుకున్న కాటిపెర్రి పెళ్శి పనులు బాధ్యతను మిండి వెయిస్ కి అప్పజెప్పారు. అంతేకాకుండా పెళ్శిని ఓ సాంప్రదాయ పద్దతి లో చేయనున్నట్లు వివరించారు. పెళ్శికి సంబంధించినంతవరకు పెళ్శి కూతురు చేతికి ఇండియా మెహాంది మరియు ఇండియా కిరీటం తేనున్నారని మిండి తెలిపారు. ఈ విషయం పై కాటిపెర్రి చాలా ఆనందంగా ఉన్నట్టు వివరించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu