'చెర్రీ' కి 10mn పౌండ్లను ఆశ చూపిన రియాలిటీ షో
లండన్: అమెరికన్ సింగింగ్ రియాలిటీ షో 'అమెరికన్ ఐడల్' జడ్జి ప్యానెల్‌లో సింగర్ చెర్రీ కోల్ చేరితే ఆమెకు 10 మిలియన్ పౌండ్లను ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని సదరు రియాలిటీ షో నిర్వాహాకులు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే గత 10 సంవత్సరాలుగా ఈ రియాలిటీ షోని నిర్వహిస్తున్న 52 సంవత్సరాల వయసు కలిగిన సైమన్ ఫుల్లెర్, ఇందులో జడ్జిగా వ్యవహారిస్తున్న సైమన్ కోవెల్ కోరిక మేరకు చెర్రీ కోల్‌ని సంప్రదించినట్లు సమాచారం.
ఐతే ఈ విషయంపై స్పందించిన చెర్రీ కోల్ అధికార ప్రతినిధి మాత్రం దీనిని ఓ రూమర్‌గా కొట్టి పారేశాడు. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు. అమెరికన్ ఐడల్ జడ్జి ప్యానెల్ సభ్యురాలుగా చేరమని తమ వద్దకు ఎవరూ రాలేదని తెలిపారు. అమెరికన్ ఐడల్ రియాలటీ టెలివిజన్ సింగింగ్ కాంపిటేషన్‌ని 19 ఎంటర్టెన్మెంట్ పై జూన్ 11, 2002లో ప్రారంభించారు. నీల్సన్ రేటింగ్స్ ప్రకారం ప్రపంచంలో ఎక్కువ మంది వీక్షించే రియాలిటీ షో గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది.
ఈ రియాలిటీ షో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే కొత్త సోలో రికార్డింగ్ కళాకారులను గుర్తించడం, విజేతను ప్రేక్షకుల ద్వారా నిర్ణయించబతారు. ఈ ఓటింగ్ ని ప్రేక్షకులు టెలిఫోన్, ఇంటర్నెట్, ఎస్ఎమ్ఎస్ టెక్ట్ ద్వారా చేస్తారు. ఈ తరహా షోలు ఇండియాలో కూడా మొదలయ్యాయి. ఇండియాలో 'ఇండియన్ ఐడల్' అంటూ సోనీ టీవి నిర్వహిస్తుంది.


Click it and Unblock the Notifications











