భారీ బడ్జెట్ మూవీకి ఊహించని షాక్... చరిత్రలో అతిపెద్ద ప్లాప్!

By Bojja Kumar

Recommended Video

China Movie Asura Collections Goes Down

మన సినిమాలు చైనాలో విడుదలైన భారీ వసూళ్లు సాధిస్తున్నట్లు తరచూ వార్తల్లో వింటూనే ఉన్నాం. దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్, బాహుబలి 2 లాంటిచి చిత్రాలు అక్కడ వందల కోట్ల వసూళ్లు రాబట్టాయి. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన ఈ దేశం ఇండియన్ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలకు అతిపెద్ద మార్కెట్. విదేశీ సినిమాలనే చైనీలు ఇంతలా ఆదరిస్తున్నారంటే... తమ దేశానికి చెందిన సొంత సినిమాలు అక్కడ ఏ రేంజిలో ఆడతాయో అని ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల చైనా సినీ చరిత్రలోనే అతిపెద్ద బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన 'అసుర'కు బాక్సాఫీసు వద్ద ఊహించని షాక్ తగిలింది.

చైనా చరిత్రలోనే అతిపెద్ద బడ్జెట్ మూవీ

చైనా చరిత్రలోనే అతిపెద్ద బడ్జెట్ మూవీ

చైనా సినిమా చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో 113 మిలియన్‌ డాలర్ల( రూ.700 కోట్లు) భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘అసుర' అనే చిత్రం ఘోర పరాజయం పాలవ్వడం చర్చనీయాంశం అయింది.

 ఎంత నష్టం అంటే..?

ఎంత నష్టం అంటే..?

చైనాకు చెందిన అలీబాబా పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇది ఒక ఫాంటసీ మూవీ. చైనీయుల సంస్కృతి, సంప్రదాయాలను మేళవించి తెరకెక్కించిన ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపలేదు. తొలి వారం 7.3 మిలియన్‌ మాత్రమే రాబట్టడంతో సినిమాను థియేటర్ల నుండి తీసేశారు. దీంతో నిర్మాతలు రూ. 650 కోట్లకుపైగా నష్టపోవాల్సి వచ్చింది.

 ఆరేళ్లు కష్టపడ్డారు

ఆరేళ్లు కష్టపడ్డారు

ఈ సినిమాను తెరకెక్కించేందుకు దాదాపు ఆరేళ్లు కష్టపడ్డారు. చైనాలో ఇప్పటి వరకు రూ. 300 నుండి 400 కోట్ల బడ్జెట్‌ రేంజిలో పెద్ద సినిమాలు వచ్చాయి. అయితే ‘అసుర' కోసం ఏకంగా రూ. 700 కోట్లు ఖర్చు పెట్టారు. సినిమా పెద్ద ప్లాప్ అవ్వడంతో ఇంత డబ్బు, ఆరేళ్ల కష్టం వృధా అయినట్లయింది.

అసుర

అసుర

‘అసుర' మూవీలో హాంగ్‌కాంగ్‌కు చెందిన నటులు టోనీ కాఫాయ్‌, కరీనా లౌ నటించారు. 141 నిమిషాలు నిడివిగల ఈ చిత్రంలో 2,400 షాట్స్ ఉన్నాయి. ఎంత గ్రాండ్‌గా తీస్తే ఏం లాభం..ప్రేక్షకులు మెచ్చే విధంగా తీయనపుడు? రివ్యూలు రేటింగ్స్ కూడా 3/10 మించి రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X