'అవతార్' జనాన్ని చెడిపేస్తుందేమోనని అక్కడ నిషేధించారు..!!

By Kuladeep

ఇటీవలే చైనాలో విడుదలయిన 'అవతార్' సినిమాకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అవతార్ సినిమా టికెట్టు దొరకడమే అదృష్టంగా భావిస్తున్నారు. అక్కడ అవతార్ సినిమా టికెట్లను తమ స్నేహితులకు బహుమతులుగా ఇచ్చుకుంటున్నారంటే ఈ సినిమాకు అక్కడున్న డిమాండ్ ఏంటో అర్థంచేసుకోవచ్చు. కానీ దగ్గర్లో ఈ సినిమాను బ్యాన్ చెయ్యాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అక్కడి మీడియా వారు రెండు కారణాలను ఒకటి ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు ముందు స్థానిక సినిమాలున్న థియేటర్లు వెలవెలబోతున్నాయట. ఇది అక్కడి నిర్మాతల నడ్డి విరుస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రెండోది అవతార్ సినిమాలో 'నావీ' లు వారి స్థలాన్ని దక్కించుకోవడానికి చేసిన భీకర యుద్ధం, అక్కడి ప్రభుత్వం బలవంతంగా భూమిని ఆక్రమించుకుంటున్న స్థానికులను తిరగబడేందుకు ప్రేరేపిస్తోంది అనేది మరో అభియోగం.

దీంతో ఈ సినిమా 2-డి వెర్షన్ ను జనవరి 23వ తేదీ నుండీ నిలిపివేయనున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ సినిమా 3-డి వెర్షన్ మాత్రం బ్యాన్ చేసే ఆలోచన లేదని స్పష్టం చేసింది. దీంతో ప్రేక్షకుల కోరిక మేరకు 21 మరియు 22వ తారీఖులలో ఈ సినిమా మిడ్ నైట్ షోలను కూడా ప్రదర్శిస్తున్నట్టు థియేటర్ యాజమాన్యం చెబుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X