twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాలీవుడ్ సినిమాకి సహా నిర్మాతగా చైనా కంపెనీ..!

    By Nageswara Rao
    |

    ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మొదటి 'ఐరన్ మ్యాన్' పార్ట్ బాక్సీఫీసు రికార్డుల్ని సృష్టించిన తరుణంలో దీనికి అనుబంధంగా 'ఐరన్ మ్యాన్ 2' విడుదల చేసి రికార్డు స్దాయి కలెక్షన్స్‌ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'ఐరన్ మ్యాన్ 3' సినిమాని విడుదల చేసేందుకు డిస్నీ కంపెనీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

    'ఐరన్ మ్యాన్ 3' సినిమాకి కో - ప్రోడ్యూసర్‌ బాధ్యతలను నిర్వహించేందుకు గాను చైనా ఆధారిత ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ డిఎమ్జి ఎంటర్టెన్మెంట్ ముందుకు వచ్చింది. డిఎమ్జి ఎంటర్టెన్మెంట్ తాను కో - ప్రోడ్యూస్ చేస్తానని ముందు రావడానికి గల కారణం 'ఐరన్ మ్యాన్ 3' సినిమా పార్ట్ కొంత భాగం చైనాలో చిత్రీకరించడమే.

    ఈ సినిమాని కో - ప్రోడ్యూస్ చేయడంతో పాటు చైనాలో "చైనా వాల్ డిస్నీ' సంస్దతో కలసి డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్బంలో డిఎమ్జి ఎంటర్టెన్మెంట్ సంస్ద సిఈవో డాన్ మింన్జ్ మాట్లాడుతూ ఈ కలయికతో మేము ప్రపంచంలో ఎక్కువ ఎత్తుకు వెళ్ళనున్నట్లు తెలిపారు. ప్రెస్ మీట్‌లో హాలీవుడ్, చైనా కలయికలో నిర్మితమవుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మైల్ స్టోన్‌గా మిగిలిపోనుందనన్నారు.

    ప్రపంచ వ్యాప్తంగా ఐరన్ మ్యాన్ ఫ్రాంచైజీ సినిమాలు బిగ్ సక్సెస్‌ని సాధించిన విషయం తెలిసిందే. గతంలో ఐరన్ మ్యాన్ సినిమాలో నటించిన రాబర్ట్ డౌనీ జూనియర్, గ్వినేత్ పాల్ట్రో మరియు డాన్ చాడిల్ వారి పాత్రలలో తిరిగి నటించనున్నారు.

    English summary
    China-based film production company DMG Entertainment will co-produce the third installment of the popular “Iron Man” franchise. A part of the film will be shot in China too.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X