దర్శకుడికి రూ. 7.6 కోట్ల జరిమానా!
బీజింగ్: చైనా ప్రఖ్యాత దర్శకుడు ఝాంగ్ యీమౌకు అక్కడి ప్రభుత్వం 7.4 మిలియన్ యెన్లు(రూ. 7.6 కోట్లు) జరిమానా విధించింది. ఇంత భారీ మొత్తంలో జరిమానా విధించడానికి గల కారణం ఏంటోతెలుసా? అక్కడి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మంది బిడ్డలను కనడమే.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనా.....తన జనాభాను తగ్గించుకోవడంలో భాగంగా ఎప్పటి నుండో ఒక జంటకు ఒకే బిడ్డ పాలసీని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దీని వల్ల జనాభా పెరుగుదలను కంట్రోల్‌లో పెట్టగలిగింది అక్కడి ప్రభుత్వం. అయితే ఇటీవల నిబంధనలు కాస్త సడలించి ఇద్దరు పిల్లల కలిగి ఉన్నా ఫర్వాలేదనే నిబంధన తెచ్చింది.

అయితే దర్శకుడు ఝాంగ్ యీమౌ మాత్రం ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా......వారికి ఇద్దరు కుమారులను, ఒక కుమార్తెను కన్నారు. విషయం బయటకు పొక్కడంతో తాము చేసిన తప్పును ఒప్పకున్నాడు ఈ దర్శకుడు. దీంతో ఝాంగ్ యీమౌకు 7.4 మిలియన్ యెన్ల జరిమానా విధించింది. ఝాంగ్ యీమౌ బీజింగ్ ఒలంపిక్స్ చీఫ్ డైరెక్టర్ గా కూడా వ్యవహరించారు. ఇంత పెద్ద హోదాలో పని చేసిన వ్యక్తి ఇలా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కడం ఏమిటని పలువురు ముక్కన వేలేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











