For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఈ సినిమా కాన్సెప్టు విన్నారా.. షాకింగ్ గా ఉంది!! (‘ప్యాసెంజర్స్‌’ ప్రివ్యూ)

  By Srikanya
  |

  లాస్ ఏంజిల్స్: విభిన్నమైన కాన్సెప్ట్ లతో భారీ బడ్జెట్ లతో సినిమాలు రూపొందించి హిట్ కొట్టడం హాలీవుడ్ కు కొత్తేమీ కాదు. కథలో కొత్తదనం, కథనంలో ఆసక్తిగొలిపే ఎలిమెంట్స్ ని వెంటబెట్టుకుని, అద్బుతమైన ఫెరఫార్మెన్స్ తో చిత్రాలను డిజైన్ చేయటం వీరి సక్సెస్ ధీరి. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ సినిమాలకు అక్కడ మంచి ఆదరణ ఉంది.


  హాలీవుడ్ ఈ ఏడాది వ‌చ్చిన సినిమాల్లో విభిన్నమైన చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది పాసింజ‌ర్స్. మార్టిన్ టిల్ డుమ్ తెర‌కెక్కించిన ఈ చితం డిసెంబ‌ర్ 21న విడుద‌లైంది. అక్క‌డ మంచి వ‌సూళ్ల‌నే సాధిస్తుంది ఈ చిత్రం. ఇక ఇందులో హీరోయిన్ గా న‌టించిన జెన్నీఫ‌ర్ లారెన్స్ పాసింజ‌ర్స్ చిత్రంలో చేయటం తన అదృష్టమని మురసిపోతోంది.

  ఈ చిత్రాన్ని మోర్టిన్‌ టిల్‌డమ్‌ తెరకెక్కించారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో విడుదలైన ఈ చిత్రం శుక్రవారం ఇండియాలో ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ చిత్రంలో కథఏంటి, హైలెట్స్ ఇక్కడ చూద్దాం.

   సాహసోపేతమైన లవ్ స్టోరీ

  సాహసోపేతమైన లవ్ స్టోరీ

  ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాకు, లవ్ స్టోరీని కలిపి, దానికి టెన్షన్ ఎలిమెంట్ ని యాడ్ చేసి వదిలారు ప్యాసింజర్స్ సినిమాని. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో సాహసభరితమైన ప్రేమకథాచిత్రంగా ‘ప్యాసెంజర్స్‌' రాబోతోంది. ‘జురాసిక్‌ వరల్డ్‌', ‘గార్డియన్స్‌ ఆఫ్‌ గెలాక్సీ' చిత్రాల నటుడు క్రిస్‌ ప్రాట్‌, ‘ఎక్స్‌మెన్‌' సిరీస్‌ నటి జెన్నిఫర్‌ లారెన్స్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

   120 ఏళ్లు ప్రయాణిస్తేనే..

  120 ఏళ్లు ప్రయాణిస్తేనే..


  అంతరిక్షంలో హోమ్‌స్టెడ్‌-2 అనే ఓ నూతన గ్రహాన్ని కనుగొంటారు శాస్త్రవేత్తలు. అందులో జనజీవనయోగమైన అంశాలున్నాయేమో తెలుసుకొనేందుకు స్పేస్ షిప్ లో క్రిష్, జెన్నీఫర్ ను పంపిస్తారు. ఆ అంతరిక్ష నౌకలో ఐదు వేల మంది ప్రయాణికులు... ఓ కొత్త గ్రహానికి కోటి కలలతో వారి పయనం మొదలైంది... ఒకటీ రెండూ కాదు 120 ఏళ్లు ప్రయాణిస్తేనే గమ్యం చేరేది... అందుకే అందరినీ గాఢ నిద్రావస్థలో ఉంచారు..

   హీరో కు ముందే మెలకవ

  హీరో కు ముందే మెలకవ


  ఈలోపు వారి జీవిత కాలం ముగిసి చనిపోకుండా అందరినీ ప్రత్యేక పరికరాల సాయంతో నిద్రావస్థలో ఉంచుతారు. సాంకేతిక సమస్యలు తలెత్తి జిమ్‌ ప్రెట్‌సన్‌ (క్రిస్‌ ప్రాట్‌) అనే మెకానికల్‌ ఇంజినీరుకు 90 ఏళ్ల ముందే మెలకువ వస్తుంది.

   ప్రేమలోకి దించాడు

  ప్రేమలోకి దించాడు

  సంవత్సరం పాటు ఒంటరిగా గడిపిన జిమ్‌ తోడుకోసం అరోరా లేన్‌ (జెన్నిఫర్‌ లారెన్స్‌) అనే అందమైన అమ్మాయిని నిద్ర నుంచి మేల్కొనేలా చేస్తాడు. ఒంటరితనం భరించలేక ఓ అందమైన ముద్దుగుమ్మను నిద్రలేపి ప్రేమలో దించాడు... అంతరిక్ష లోకంలో ప్రణయ వీధుల్లో విహరించారు.

   అతనే కావాలని ..

  అతనే కావాలని ..

  సాంకేతిక సమస్యలతోనే అరోరాకు మెలకువ వచ్చిందని నమ్మిస్తాడు. చేసేదేమీ లేక ఆ నౌకలో తన అనుభవాలను పుస్తకంగా రాయడం మొదలుపెడుతుంది అరోరా. ఈక్రమంలో జిమ్‌, అరోరా ప్రేమలో పడతారు. అయితే జిమ్‌ కావాలనే తనను మేల్కొలిపాడని అరోరాకు తెలియడంతో అతనిపై ద్వేషం పెంచుకుంటుంది.

   ఏం చేయాలి, ప్రేమ ఏమైంది

  ఏం చేయాలి, ప్రేమ ఏమైంది

  ఆ తర్వాత నౌకకు కొన్ని సమస్యలు తలెత్తి వారు ప్రమాదంలో పడతారు. ఇంతలోనే ఉపద్రవం ముంచుకొచ్చేసింది... నౌకకు ఏవో సమస్యలు... వారి ప్రేమ... ప్రయాణికుల ప్రాణాలు అన్నీ గాలిలో దీపాలయ్యాయి... మరి ఆ నౌక ఏ తీరానికి చేరింది? వారి ప్రేమకథ ఏ మలుపు తిరిగింది? అప్పుడు వారేం చేశారు...ఇలాంటి ఉత్కంఠభరితమైన కథతో తెరకెక్కింది ‘ప్యాసెంజర్స్‌'.

  rnrn

  2015లోనే


  దాదాపు పదేళ్ల క్రితమే ‘ప్యాసెంజర్స్‌' చిత్ర కథ సిద్ధమైంది. తారాగణం, దర్శకుల ఎంపికలో మార్పులు జరిగి 2015లో షూటింగ్ ప్రారంభమైంది.

   ఇప్పటికి అంత వసూలు

  ఇప్పటికి అంత వసూలు

  110 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. గతేడాది డిసెంబరు 21న అమెరికా, బ్రిటన్‌, కెనడాల్లో ‘ప్యాసెంజర్స్‌' విడుదలైంది. ఇప్పటికే 123 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది.
  భారీ పారితోషికాలు
  ఈ చిత్రంలోని హీరో,హీరోయిన్స్ కు భారీ పారితోషికాలు ఇచ్చారని హాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

   కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది

  కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది

  క్రిస్‌ప్రాట్‌కు 12 మిలియన్‌ డాలర్లు (రూ.80 కోట్లకు పైగా), జెన్నిఫర్‌ లారెన్స్‌కు 20 మిలియన్‌ డాలర్లు (136 కోట్లకు పైగా) ఇచ్చినట్లు సమాచారం. చిత్రీకరణ సమయంలో వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందట. తెరపైనా వారి కెమిస్ట్రీ ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

   మన దేశంలో రేపే

  మన దేశంలో రేపే

  ఉత్కంఠ భరితమైన అంశాలతో సాగే కథతో తెరకెక్కిన ఈ చిత్రం...జనవరి 6న భారతదేశమంతటా చిత్రం తెలుగు, తమిళం, హిందీ మరియు ఆంగ్ల భాషలలో ఒకేసారి విడుదల కానుంది. మరి మన దేశ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  English summary
  Today’s most engaging movie stars in Jennifer Lawrence and Chris Pratt, great production design, special effects and beautiful cinematography and you have Passengers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X