Oscars 2023 : చెంపదెబ్బ ఎఫెక్ట్, ఆస్కార్‌కు రానన్న క్రిస్ రాక్.. నేరం జరిగిన ప్రాంతమంటూ..
గతేడాది నిర్వహించిన 94వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) ప్రదానోత్సవంలో జరిగిన చెంపదెబ్బ ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ వేడుకలకు వ్యాఖ్యత వ్యవహరించిన ప్రమఖ కమెడియన్ క్రిస్ రాక్‌పై హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ చేయిచేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు సెలబ్రిటీలు వివిధ రకాలుగా స్పందించారు. తర్వాత తను చేసిన పనికి క్షమాణలు చెబుతూ బహిరంగంగా పోస్ట్ కూడా పెట్టాడు విల్ స్మిత్. అయితే ఈ సంఘటన ప్రభావం వచ్చే 95వ ఆస్కార్ వేడుకలపై పడిందా? అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

విమర్శలు..
2021లో నిర్వహించిన 94 అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో హోస్ట్ క్రిస్ రాక్‌ను స్టార్ హీరో విల్ స్మిత్ చెంప దెబ్బ కొట్టడం యావత్ ప్రపంచ సినీ లోకాన్ని విస్మయానికి గురి చేసింది. ఈ సంఘటనపై అనేక మంది సెలబ్రిటీలు తమ గొంతెత్తి విమర్శించారు. విల్ స్మిత్ చేసిన పనికి అకాడమీ పెద్దలు సైతం యాక్షన్ తీసుకున్నారు. కొన్నేళ్ల పాటు విల్స్మిత్ను బహిష్కరించారు కూడా.

నిరాకరించిన క్రిస్ రాక్..
అయితే తాజాగా ఈ చెంపదెబ్బ ఎఫెక్ట్ వచ్చే ఏడాది (2023) నిర్వహించే ఆస్కార్ వేడుకలపై పడిందా? అనే అనుమానాలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే? 2023 ఆస్కార్ వేడుకల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు కమెడియన్ క్రిస్ రాక్ నిరాకరించారని తెలుస్తోంది. ఈ మేరకు పలు కథనాలు వెలువడినట్లు సమాచారం. ఆస్కార్‌కు హోస్ట్‌గా అలరించాలంటూ క్రిస్ రాక్‌కు తాజాగా ఆఫర్ వచ్చిందట.

నేర ప్రాంతగా..
ఈ ఆఫర్‌ను క్రిస్ రాక్ నిరాకరించినట్లు సమాచారం. ఆస్కార్ వేడుకల ప్రాంతాన్ని నేర ప్రాంతంగా క్రిస్ రాక్ అభివర్ణించినట్లుగా అరిజోనా పబ్లిక్ తెలిపింది. మరోసారి ఆస్కార్‌లో హోస్ట్‌గా వ్యవహరించాలన్న ఆఫర్‌పై ''మరోసారి ఆస్కార్ వేడుకల్లో పాల్గొనడం అంటే? నేరం జరిగిన ప్రాంతానికి వెళ్లి వచ్చినట్లే ఉంటుంది'' అని అరిజోనాలోని ఆ కామెడీ సెట్లో క్రిస్ రాక్ స్పందించినట్లు అరిజోనా రిపబ్లిక్ వెల్లడించింది.

ఆ పాత్రతో పోలుస్తూ జోక్..
అలాగే విల్ స్మిత్ గురించి ''ఆయన నాకంటే పెద్దవాడు. ఆ ప్రాంత మరోసారి మా మధ్య ఇలాంటి తరహా పోరాటానికి అనుమతించదు'' అని క్రిస్ రాక్ తెలిపినట్లు అరిజోనా పబ్లిక్ పేర్కొంది. కాగా 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఓ కామెడీ ట్రాక్ చెబుతూ విల్ స్మిత్ సతీమణి జాడా పింకెట్ ప్రస్తావన తీసుకొచ్చాడు క్రిస్ రాక్. ఆమె గుండుతో కనిపించేసరికి, జీఐ జేన్ మూవీ సీక్వెల్లో డెమి మూర్ పాత్ర పోషిస్తున్నారా? అని కామెడీ చేశాడు క్రిస్ రాక్.

అలోపేసియా కారణంగా..
తన భార్యపై క్రిస్ రాక్ జోక్ వేయడాన్ని సహించలేకపోయిన విల్ స్మిత్ వేదికపైనే అతని చెంప పగులగొట్టాడు. అనంతరం ఈ సంఘటనకు సంబంధించి అకాడమీ, సహచరులకు క్షమాపణలు కూడా తెలిపాడు విల్ స్మిత్. ఆ మరుసటి రోజు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా క్రిస్ రాక్‌కు బహిరంగంగా క్షమాపణలు తెలిపాడు విల్ స్మిత్. తన భార్య జాడా పింకెట్ అలోపేసియా అనే అనారోగ్య సమస్య కారణంగా అలా గుండు చేయించుకుందని, దానిపై జోక్ వేసే సరికి భరించలేకపోయానని విల్ వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











