సూపర్ బౌల్‌లో చిందేస్తుందని పిలిస్తే పార్టీకే ఎసరు పెట్టిన హీరోయిన్
ప్రతి సంవత్సరం వైట్ హౌస్‌లో అమెరికా ప్రెసిడెంట్ ఇచ్చేటటువంటి సూపర్ బౌల్ పార్టీ ఈసంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈసూపర్ బౌల్ పార్టికి హాలీవుడ్ నుండి ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు అందరూ హాజరవ్వడం జరిగింది. జెన్నిఫర్ లోపెజ్, క్రిస్టినా ఆక్విలేరా లాంటి సింగర్స్‌ని మాత్రం స్పెషల్ గా ఆహ్వానించడం జరిగింది.
దానికి కారణం ఈసూపర్ బౌల్ పార్టీలో ఎంతో మంది మేధావులు చూపరులను ఆకట్టుకోవడం ఇలా సింగర్స్‌ని ఆహ్వానించడం ఎప్పటినుండో ఉన్నటువంటి సాంప్రదాయం. సూపర్ బౌల్ పార్టీలో భాగంగా గేమ్ మొదలుపెట్టడానికి ముందు సింగర్స్ పాటపాడడం సాంప్రదాయం. ఇందులో భాగంగా క్రిస్టినా ఆక్విలేరా తన పాటతో యావత్ సూపర్ బౌల్ పార్టీలో ఉన్నటువంటి అందరిని తనపాటతో ఆనంద పరవశంతో ముంచెత్తుందని అనుకుంటే పార్టీ మొత్తాన్ని కొంచెం అప్ సెట్ లోకి నెట్టివేసింది.
తను ఫెర్పామెన్స్ చేసే సమయంలో కొన్ని మూమెంట్స్ మరచిపోవడమే దీనికంతటికి కారణం అని అన్నారు. ఇది మాత్రమే కాకుండా జాతీయగీతాన్ని కూడా అందరితో ఆలపించకుండా ముందుకి వెళ్శిడం జరిగిందంట. దీనికి గాను క్రిస్టినా ఆక్విలేరా యావత్ దేశం మొత్తానికి క్షమాపణలు చెప్పడానికి సిద్దపడ్డారు. ఇది మాత్రమే కాకుండా క్రిస్టినా ఆక్విలేరా తను చేసినటువంటి ఫెర్పామెన్స్ గాను తన అసహానాన్ని వ్యక్తం చేశారు. ఇక జీవితంలో ఎటువంటి సెలబ్రిటీ పార్టీలకు హాజరకాకుడదని కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు.


Click it and Unblock the Notifications











