ఒంటరిగా బిడ్డకు తల్లిగా ఉండడం అంటే కష్టం తోకూడుకున్నపని..
క్రిస్టినా ఆక్విలేరా సింగర్ గాతనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది. ఇటీవల కాలంలో తన భార్త జోర్డాన్ బ్రాట్ మాన్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత తన కోడుకు మాక్స్ తోసింగిల్ గాజీవితాన్ని గడుపుతుంది. ఇటీవల డైయిలీ మెయిల్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తన కుమారుని గురించి తెగపోగిడేసిన క్రిస్టినా ఆక్విలేరా తన మనోభావాలను పంచుకుంది.
క్రిస్టినా ఆక్విలేరా మాట్లాడుతూ ప్రస్తుతానికి నాప్రపంచం అంతా నాకుమారుడు మాక్స్. తెల్లవారుజామునే లేచిన దగ్గరనుంచి పడుకుపోయేవరకు నాకంతా వాడే ప్రపంచం అని అంటుంది. తన 20నెలలు కుమారునికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తానని అంటుంది. మా అమ్మనాన్నకు మాదిరే మేము కూడా విడాకులు తీసుకోవడం జరిగింది. ఐతే నాబిడ్డకు మాత్రం ఆలోటు రాకుండా చూసుకుంటానని అంటుంది. మా అమ్మ లాగే అన్ని తనకు నేనై చూసుకుంటానని తన మనసులోని భావాలను వెల్లడించింది.
బ్రాట్ మన్ తోఐదు సంవత్సరాలు కలసి జీవనం సాగించినటువంటి క్రిస్టినా ఆక్విలేరా కోన్ని కారణాలు వల్ల విడిపోవడం జరిగింది. నేను నాచిన్నతనంలో పెరిగినటువంటి వాతావరణం అన్నింటిని దృష్టిలో పెట్టుకోని నాబిడ్డుకు మాత్రం అమితమైన ప్రేమను పంచుతానని అంటోంది. చివరగా మాట్లాడుతూ ఎంతైన సింగిల్ మామ్ గాఉండడం మాత్రం కోంచెం కష్టమనే చెబుతుంది.


Click it and Unblock the Notifications











