జానీ వాకర్ విస్కీ ఈవెంట్‌కి.. అందమైన బ్లాక్ స్కర్టులో..
బ్రెజిల్, జులై 12: బ్రెజిల్‌లోని రియో డి జనీరోలోలో అత్యంత ఘనంగా మ్యాడ్ మ్యాన్ స్టార్ హీరోయిన్ క్రిస్టినా హెన్డ్రిక్స్ చేతుల మీదగా ప్రముఖ విస్కీ కంపెనీ జానీ వాకర్ ఓ ఈవెంట్‌ని నిర్వహించింది. ఈ ఈవెంట్లో క్రిస్టినా హెన్డ్రిక్స్ తన చేతులతో జానీ వాకర్ బ్లూ లేబుల్ గేమ్ ఛేంజర్ విస్కీని విడుదల చేసింది. ఈ ఈవెంట్‌కు క్రిస్టినా హెన్డ్రిక్స్ నల్లని డ్రస్సు ధరించి ఈవెంట్ ఆర్గనైజర్స్‌తో పాటు అభిమానలను కూడా అలరించారు.
37 సంవత్సరాల వయసు కలిగిన క్రిస్టినా హెన్డ్రిక్స్ నలుపు స్కర్టుతో పాటు తన అందమైన పెదవులకు ఎరుపు రంగు లిప్టిక్ మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. చాలా మందిని ఇలాంటి ఈవెంట్స్‌కు పిలవగానే ఖరీదైన మేకప్‌తో పాటు బంగారు ఆభరణాలు ధరించి వస్తారు. కానీ క్రిస్టినా హెన్డ్రిక్స్ అలా కాకుండా కేవలం చెవి రింగులు ధరించి, ఒంటి మీద ఎలాంటి ఆభరణాలు లేకుండా రావడం విశేషం.
జానీ వాకర్ విస్కీని ప్రారంభించిన తర్వాత క్రిస్టినా హెన్డ్రిక్స్ మాట్లాడుతూ చాలా మంది ఉమెన్ విస్కీ తాగుబ్రోతులను పెద్దగా ఎవరూ పట్టించుకోరు. సరిగ్గా అలాంటి వారికోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ఉమెన్ విస్కీ అందరిని ఆకట్టుకుంటుందని అన్నారు. ప్రపంచంలో అత్యుత్తమైన విస్కీని తయారుచేసే జానీ వాకర్ ఉమెన్ త్రాగుబోతుల కోసం ప్రత్యేకంగా మూడు జానీ వాకర్ బ్లూ లేబుల్‌ను సర్వ్ చేసిందని చెప్పారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











