లీకైన నగ్న చిత్రాలు నావి కాదంటున్న టివి స్టార్
ఇంటర్నెట్లో నగ్నంగా సంచరిస్తున్న టివి స్టార్ క్రిస్టినా హెన్డ్రిక్స్ ఫోటోపై వస్తున్న రూమర్స్‌ని తానే స్వయంగా ఖండించారు. ఇక వివరాల్లోకి వెళితే 36 సంవత్సరాల వయసు కలిగిన క్రిస్టినా హెన్డ్రిక్స్‌కు సంబంధించిన కొన్ని నగ్న చిత్రాలు నెట్‌లో హాల్ చల్ చేస్తున్నాయి. నెట్‌లో సంచరిస్తున్న ఫోటోలలో ఒంటి మీద ఎటువంటి ఆఛ్చేదనం లేకుండా వెనుక వైపు గుండా తీసిన పోటోలు అభిమానులను సైతం ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ ఫోటోలను నెట్‌లో ఎవరు పెట్టారనే ప్రశ్నకు గాను తన ఫోన్‌ని హ్యాక్ చేసిన హ్యాకర్ ఈ సాహాసానికి పూనుకున్నాడని తెలిపింది. హ్యాకర్‌పై కేసు నమోదు చేయడం జరిగింది.
మరొక ఫోటోలో క్రిస్టినా హెన్డ్రిక్స్ ఒంటిపై తువాలును ధరించి కెమెరాకి ఫోజు ఇచ్చినట్లుగా ఉంది. ప్రస్తుతం క్రిస్టినా హెన్డ్రిక్స్ తాను రూపొందిస్తున్న 'మ్యాడ్ మెన్' ఐదవ సీజన్‌లో బిజీగా ఉంది. ఇటీవల కాలంలో మనం గమనించినట్లైతే సెలబ్రిటీల ఫోన్స్‌ని హ్యాకర్స్ కాస్త దృష్టిపెట్టినట్లు అనిపిస్తుంది. గత నవంబర్‌లో ఫ్లోరిడాకు చెందిన హ్యాకర్ యాభై మంది సెలబ్రిటీలకు చెందిన ఈమెయిల్స్, ఫోన్ ఎకౌంట్స్‌ని హ్యాక్ చేసిన విషయం తెలిసిందే.
ఈ యాభై మందిలో క్రిస్టినా ఆక్వలేరా, మిలా కునిస్, స్కేర్ లెట్ జాన్సన్ లాంటి ప్రముఖ సెలబ్రిటీలకు చెందిన నగ్న చిత్రాలను ఇంటర్నెట్లో ఫోస్ట్ చేశాడు. ఆ తర్వాత అతనిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ బంధించారు అనుకోండి.


Click it and Unblock the Notifications











