twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కిక్కు కోసం నిజమైన బోయింగ్ 747 కూల్చేశాం.. హాలీవుడ్ దర్శకుడు నోలన్ సాహాసం

    |

    హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ క్రిస్టఫర్ నోలన్ రూపొందించిన టెనెట్ విడుదలకు ముందు సంచలనాలను నమోదు చేస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన రెండో ట్రైలర్ రిలీజై అనూహ్య స్పందనను మూటగట్టుకొన్నది. ఈ చిత్రంలో ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయని నటులు రాబర్ట్ పాటిన్సన్, జాన్ డేవిడ్ వాషింగ్టన్ భరోసా ఇస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది అని చెప్పారు. ఈ సినిమా కోసం అనేక సాహసాలు చేశామని చిత్ర యూనిట్ వెల్లడిస్తూ..

    టెనెట్‌లో బాలీవుడ్ హీరోయిన్.. సీక్రెట్‌గా క్రేజీ రోల్.. ముంబైలోనే షూట్టెనెట్‌లో బాలీవుడ్ హీరోయిన్.. సీక్రెట్‌గా క్రేజీ రోల్.. ముంబైలోనే షూట్

    ప్లాస్టిక్ విమానాన్ని ధ్వంసం చేయాలని

    ప్లాస్టిక్ విమానాన్ని ధ్వంసం చేయాలని

    ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్న టెనెట్‌ చిత్రంలో ఓ బోయింగ్ విమానాన్ని ధ్వంసం చేయాల్సిన సీన్ ఉంది. షూట్ కోసం చిన్న బొమ్మలను ధ్వంసం చేసి వాస్తవంగా కనిపించేలా కంప్యూటర్ గ్రాఫిక్స్ జోడించాలని అనుకొన్నారు. లేదా ప్లాస్టిక్‌తో చేసిన డమ్మీ విమానాన్ని ధ్వంసం చేయాలని అనుకొన్నాం. లేదా కంప్యూటర్ గ్రాఫిక్స్‌లో చూపించాలనుకొన్నాం అని క్రిస్టఫర్ నోలన్ వెల్లడించారు.

    పాత బోయింగ్ విమానం దొరకడంతో

    పాత బోయింగ్ విమానం దొరకడంతో

    టెనెట్ షూటింగ్ కోసం కాలిఫోర్నియాలోని విక్టర్‌విల్లే ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ పాత బోయింగ్ 747 విమానాలు ఉన్నాయనే విషయం తెలిసింది. రియల్ సైజులో, రియల్ విమానాన్ని ధ్వంసం చేస్తే ఎలా ఉంటుందని ఐడియా వచ్చింది. దాంతో వారిని సంప్రదించగా వాటిని అమ్మడానికి వారు ముందుకు రావడంతో మా కృషికి ఫలితం దక్కినట్లయింది అని క్రిస్టఫర్ నోలన్ తెలిపారు.

    విమాన ప్రమాదానికి సంబంధించిన సీన్ కోసం

    విమాన ప్రమాదానికి సంబంధించిన సీన్ కోసం

    విమాన ప్రమాదానికి సంబంధించిన సీన్‌ను వాస్తవంగా ఉండాలని, ప్రేక్షకులకు థ్రిల్లింగ్ కలిగించేలా చిత్రీకరించాలని భావించాం. ముందుగా ఫైబర్ గ్లాస్‌తో చేసిన జెట్‌ను క్రాష్ చేయాలని అనుకొన్నాం. ప్రేక్షకులకు మరింత కనువిందుగా ఉండేందుకు చివరకు రియల్ బోయింగ్ 747న‌ు సినిమా కోసం ధ్వంసం చేశాం అని నోలన్ పేర్కొన్నారు.

    ధ్వంసానికి భారీగానే కసరత్తు

    ధ్వంసానికి భారీగానే కసరత్తు

    బోయింగ్ 747 విమానాన్ని ధ్వంసం చేసే సీన్ కోసం చాలా కసరత్తు చేశాం. మా స్పెషల్ ఎఫెక్ట్ సూపర్‌వైజర్, ప్రొడక్షన్ డిజైనర్, ఇతర సాంకేతిక నిపుణులతో చర్చించి పక్కా ప్లాన్ రూపొందించాం. సుదీర్ఘంగా సాగే ఈ ఛేజింగ్ సీక్వెన్స్‌ను కెమెరాలో బంధించడానికి చేసిన ప్రయత్నాలు చాలా సంతృప్తిని ఇచ్చాయి. తెరపైన అద్బుతమైన ఫీలింగ్ మాకే కలిగింది. అదే అనుభూతిని ప్రేక్షకుడు పొందడం ఖాయం అని క్రిస్టఫర్ నోలన్ తెలిపారు.

    English summary
    Hollywood Film Maker Christopher Nolan reveasl he crashes real Boeing 747 plane for TENET. Nolan said, He thought to crash of fiber plane instead of real plane.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X