టెనెట్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే.. ప్రేక్షకుల అంచనాలు పెంచిన కొత్త పోస్టర్లు
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది 2020 ఏడాదిలో ప్రేక్షకులకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం టెనెట్. ప్రముఖ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్, మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్లను విడుదల చేశారు. వాస్తవానికి పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఆగస్టు 12వ తేదీన రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నది. జాన్ డేవిడ్ వాషింగ్టన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే రిలీజైన టెనెట్ మూవీ ట్రైలర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లు టెనెట్‌లో ఇంటెన్సిటీని, యాక్షన్ పార్ట్‌ను రిలీజ్ చేసేలా కనిపించాయి. పోస్టర్లపై ఈ చిత్ర రిలీజ్ డేట్లను కూడా ముద్రించి రిలీజ్ చేయడంతో అభిమానుల్లో అంచనాలను మరింత పెంచాయి. కాలం వేగంగా హరించుకుపోతున్నది. ఆగస్టు 12 బుధవారం రోజున టెనెట్ మూవీని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం అని కాప్షన్ పెట్టారు.

మల్టీస్టారర్ చిత్రంగా రూపొందించిన టెనెట్ ప్రముఖ నటీనటులు కీలక పాత్రలను పోషించారు. రాబర్ట్ పాటిన్సన్, కెన్నెత్ బ్రనాగ్, మైఖేల్ కెయిన్‌తోపాటు బాలీవుడ్ నటి డింపుల్ కపాడియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే డింపుల్ కాపాడియా పాత్రపై దర్శకుడు, పలువురు నటీనటులు ప్రశంసల వర్షం కురిపించారు. రెండో ట్రైలర్‌లో ఆమె పాత్ర పరిచయం ఎక్కువగా లేకున్నా సినిమాలో ఆమె రోల్ అందర్నీ థ్రిల్‌కు గురిచేస్తుంది అని అన్నారు.



Click it and Unblock the Notifications











