మళ్లీ థియేటర్లకు రప్పించే సినిమా.. టెనెట్ ట్రైలర్ వైరల్
ప్రపంచ ప్రసిద్ది చెందిన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్. ఎంతో మంది సూపర్ హీరోలను వెండితెరపై సృష్టించాడు. ఎన్నో అద్భుతాలను క్రియేట్ చేశాడు. ది డార్క్ నైట్, ఇన్‌స్మోనియా, బ్యాట్‌మ్యాన్ బిగిన్స్, ఇన్‌సెప్షన్, డన్‌కిర్క్, మెమెంటో, ది ప్రెస్టీజ్ వంటి ఎన్నో అద్భుత చిత్రాలను ప్రపంచ సినీ ప్రేక్షకులకు అందించాడు. ఈయన మెదడులోంచి రాబోతోన్న మరో కళాఖండం.. అందర్నీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. టెనెట్ అనే చిత్రం నుంచి ఇప్పటికే ఓ ట్రైలర్ రాగా.. తాజాగా రెండో ట్రైలర్‌ను విడుదల చేశారు.
వీటిని గమనిస్తూ ఉంటే.. ఇది మూడో ప్రపంచ యుద్దం నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు కనిపిస్తోంది. అయితే టైమ్ మిషన్ అనే కాన్సెప్ట్ కూడా ఇందులో మిళితమైనట్టు కనిపిస్తోంది. ఎందుకుంటే వర్తమానం, భవిష్యత్తు అంటే కథనం ముందుకు వెనకకు సాగుతున్నట్టు తెలుస్తోంది. మూడో ప్రపంచ యుద్దాన్ని నివారించేందుకు జాన్ డేవిడ్ వాషింగ్టన్ అనే పాత్ర పోరాటాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ చిత్రంలో జాన్ డేవిడ్ వాషింగ్టన్ కాకుండా.. రాబర్ట్ పాటిన్సన్, ఎలిజిబెత్ డెబికి, డింపుల్ కపాడియా, ఆరోన్ టేలర్ జాన్సన్, క్లెమెన్స్ పోజీ, మైఖేల్ కెయిన్, కెన్నెత్ బ్రానగ్ వంటి స్టార్స్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం గురించి క్రిస్టోఫర్ నోలన్ మాట్లాడుతూ... ఇందులో అన్ని రకాల జానర్స్‌ను ఉంటాయని ప్రేక్షకులను కొత్త అనుభూతికి లోనయ్యేలా చేస్తాయని తెలిపాడు. మామూలుగా అయితె టెనెట్ చిత్రాన్ని జూలై 17 రిలీజ్ చేస్తామని ప్రకటించగా.. రెండో ట్రైలర్‌లో మాత్రం విడుదల తేదీపై ఎలాంటి క్లారిటీని ఇవ్వలేదు.


Click it and Unblock the Notifications











