డింపుల్ కాపాడియాపై ప్రశంసల వర్షం.. ఫిదా అయిన టెనెట్ దర్శకుడు
బాలీవుడ్‌లో అలనాటి అందాల తార, గ్లామర్ బేబి డింపుల్ కపాడియాపై హాలీవుడ్ నటుడు కెన్నెత్ బ్రనాఘ్ ప్రశంసల వర్షం కురిపించారు. వీర్దిదరూ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన టెనెట్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇండియాలో జరిగిన షూటింగులో డింపుల్ కాపాడియా పాల్గొన్నారు. టెనెట్‌లో డింపుల్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలిపారు.
బ్రనాఘ్ నటించిన ఆర్టేమిస్ ఫోల్ అనే మూవీ డిస్నీ ప్లస్‌లో రిలీజ్ కానున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. టెనెట్ సినిమా వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డింపుల్ కాపాడియా గురించి చెబుతూ టెనెట్‌లో అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు. ఆమె నటనా ప్రతిభ చూసి డైరెక్టర్ నోలన్, హీరో జాన్ డేవిడ్ వాషింగ్టన్ థ్రిల్ అయ్యారు. ఆమె ఫెర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయ్యారు అంటూ తెలిపారు.

అయితే డింపుల్ కాపాడియాతో నేను కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. కానీ ఆమె పాత్ర గురించి, ఫెర్ఫార్మెన్స్ గురించి నాకు అన్ని వివరాలు తెలుసు. ఆమె ఏ రేంజ్‌లో నటనను ప్రదర్శించిందో మా యూనిట్ సభ్యులకు తెలుసు. ఆమె పాత్ర ప్రాధాన్యత రిలీజ్ తర్వాత ప్రేక్షకులే చెబుతారు అని బ్రనాఘ్ అన్నారు.
డైరెక్టర్ నోలన్ విషయానికి వస్తే.. డార్క్ నైట్ ట్రయాలజీ, ఇన్సెప్షన్, ఇంటర్‌స్టెల్లర్, డన్‌కిర్క్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన తాజాగా టెనెట్‌ను రూపొందించారు. కొద్ది రోజుల క్రితం రిలీజైన ట్రైలర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడమే కాకుండా భారీ అంచనాలను నెలకొల్పాయి.


Click it and Unblock the Notifications











