Citadel Trailer Review గతాన్ని గుర్తు తెచ్చుకో.. భవిష్యత్‌ను కాపాడాలి.. ప్రియాంక చోప్రా స్టన్నింగ్‌గా!
హాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతలు రిచర్డ్ రుస్సో, ఆంథోని రుస్సో నిర్మించిన సిటడెల్ వెబ్ సిరీస్ రిలీజ్‌కు సిద్దమైంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ నటించిన ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్‌గా రూపొందించారు. నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకొన్న ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందనే విషయంలోకి వెళితే..

యాక్షన్ ప్రధానంగా స్పై థ్రిల్లర్
సిటడెల్ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ యాక్షన్ ప్రధానంగా కనిపించింది. ప్రియాంక చోప్రా, ఇతర క్యారెక్టర్ల మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా కనిపించాయి. ట్రైలర్ రొటీన్‌గా కట్ చేసినప్పటికీ.. కొన్ని సన్నివేశాలు మాత్రం ఎప్పుడెప్పుడూ చూద్దామా అనే ఆసక్తిని, క్యూరియాసిటినీ క్రియేట్ చేసింది.

సెటడెల్ అంటే..
ట్రైన్ యాక్సిండెంట్ నేపథ్యంగా మొదలైన కథలో సిటడెల్ అనే రహస్య గూఢచారిగా ప్రియాంక చోప్రా కనిపించింది. ట్రైలర్‌లో యాక్సిడెంట్‌కు గురైన ప్రియాంక చోప్రా గతాన్ని మరిచిపోయాందా అనే అనుమానాన్ని క్రియేట్ చేశారు. కనిపించే నీవు ఓ అబద్దం.. నీవు ఒక సెటడెల్ అనే గూఢఛారివి. నీకు ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. ఏ దేశం పట్ల ప్రేమ ఉండదు అంటూ ప్రియాంక జతకాన్ని చెప్పే ప్రయత్నం ట్రైలర్‌లో కనిపించింది.

రిచర్డ్‌తో హాట్ హాట్‌గా రొమాన్స్
సిటడెల్ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌లో ప్రియాంక చోప్రా స్టన్నింగ్‌గా కనిపించింది. యాక్షన్, రొమాంటిక్ సీన్లలో కొత్తగా కనిపించింది. ఎమోషన్ సన్నివేశాల్లో కూడా పరిణతిని చూపించింది. సిటాడెల్ సిరీస్‌లో నాదియ షా పాత్రలో నటిస్తున్నారు. రిచర్డ్‌తో హాట్ హాట్‌గా రొమాన్స్ చేసినట్టు ఫస్ట్ లుక్ ద్వారా స్పష్టమైంది. రిచర్డ్, ప్రియాంక మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండినట్టు ట్రైలర్‌లో స్పష్టమైంది. ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్ సిరీస్‌పై అంచనాలు పెంచింది.

ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్
రిచర్డ్ మ్యాడెన్‌తో కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్‌ను ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ వెబ్ సిరీస్ ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 28వ తేదీన స్ట్రీమింగ్ కానున్నది.
సిటడెల్‌లో నటీనటులు, సాంకేతిక వర్గం
నటీనటులు: ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్, స్టాన్లీ టుసీ, లెస్లీ మాన్‌విల్లే, ఓసీ ఇఖిలే, ఆస్లీ కమ్మింగ్స్, రొనాల్డ్ మోలర్ తదితరులు
డైరెక్టర్స్: జోష్ అప్పేల్బామ్, బ్రాయన్ ఓ
నిర్మాతలు: ఆంథోని రుస్పో, జోసెఫ్ రుస్పో, మైక్ లారోకా
సినిమాటోగ్రఫి: న్యూటన్ థామస్ సీజెల్, మైఖేల్ ఉడ్
బ్యానర్: గోజీ ఏజీబీవో, మిడ్‌నైట్ రేడియో, అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్ డేట్: 2023-04-28


Click it and Unblock the Notifications











