రాలిపోయిన హాలీవుడ్ తార..!!
హాలీవుడ్ తార బ్రిట్టానీ ముర్ఫి కన్నుమూసారు. ఈ 32 ఏళ్ల తార గుండె సంబంధిత వ్యాధితో మరణించారు. సెదార్స్ సినై మెడికల్ సెంటర్ లో చికిత్స పొందుతూ ఆమె తనువు చాలించారు. లాస్ ఏంజిల్స్ టైమ్స్ ప్రకారం ఆమె గుండె సంబంధిత వ్యాధిలో ఆసుపత్రిపాలయి మరణించారుని తెలిసింది. కానీ ఆమె మృత్యువుకు గల కారణాన్ని ఆసుపత్రి వర్గాలు మాత్రం వెళ్లడించలేదు.
న్యూజెర్సీ లో పుట్టి పెరిగన ఈ తార క్లూలెస్ సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించింది. 8 మైల్ తో స్టార్ డమ్ ను సంపాదించుకుంది. 'జస్ట్ మ్యారీడ్' వంటి రొమాంటిక్ ఎంటర్టెయినర్ లో నటించిన ఈమె బిటీష్ కు చెందిన స్క్రీన్ రైటర్ సిమోన్ జాక్ ను వివాహమాడారు. ఆ తర్వాత 'జస్ట్ మ్యారీడ్' సినిమా సహనటుడు అష్టన్ కుట్చర్ తో డేటింగ్ చేసారు. కాగా ఈమె మరణానికి హాలీవుడ్ మొత్తం సంతాపాన్ని ప్రకటించింది.
బ్రిట్టానీ ముర్ఫి హాలీవుడ్ మృతి జస్ట్ మ్యారీడ్ అష్టన్ కుట్చర్ సిమోన్ జాక్ brittany murphy hollywood clueless just married simon monjack ashton kutcher


Click it and Unblock the Notifications