అంతా ప్రోస్థటిక్ మహిమ.. కొలిన్ ఫారెల్ ఎలా మారిపోయాడో చూడండి
సూపర్ హీరోల చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. అందులో బ్యాట్ మ్యాన్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. బ్యాట్ మ్యాన్‌కే కాదు.. అతడు వాడే వాహనాలకు కూడా ప్రత్యేకంగా అభిమానులే ఉంటారు. అలాంటి బ్యాట్‌మ్యాన్‌లో మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు హాలీవుడ్ సిద్దమవుతోంది. మాట్ రీవ్స్ డైరెక్ట్ చేస్తున్న 'ద బ్యాట్‌మ్యాన్' షూటింగ్ కాస్త గ్యాప్ తరువాత మళ్లీ మొదలైంది. కోవిడ్ వల్ల ఈ మూవీ షూటింగ్ ఆలస్యమైంది.
ఈ చిత్రంలో ద రిడ్లర్‌గా పాల్ డానో, జోమ్స్ గోర్డాన్ క్యారెక్టర్‌లో జెఫ్రీ రైట్, కాట్‌వుమన్‌గా జోయే క్రావిట్జ్, పెంగ్విన్‌గా కొలిన్ ఫారెల్, గిల్ కొల్సన్ క్యారెక్టర్‌లో సర్స్‌గార్డ్ నటిస్తున్నారు. ఇందులో పెంగ్విన్ పాత్రలో కొలిన్ ఫారెల్ లుక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో కొలిన్ లుక్కు చూసి అందరూ షాక్ అయ్యారు.

ప్రోస్థటిక్ మేకప్ మహిహ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మంచి వయసు మీదున్న కుర్రాడిని పండు ముసలివాడిగా కూడా మార్చేయెచ్చు. తాజాగా కొలిన్ విషయంలోనూ అదే జరగింది. ముసలి క్యారెక్టర్‌లో కొలిన్ వేషం అదిరిపోయింది. ఈ మూవీ టిం సభ్యుల్లో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో మళ్లీ వాయిదా పడింది. మళ్లీ సెప్టెంబర్ మధ్యలో ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సినిమా 2022 మేలో విడుదల కానున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











