కరోనావైరస్ ప్రముఖ కమెడియన్ కన్నుమూత
ప్రముఖ బ్రిటన్ కమెడియన్ ఎడ్డీ లార్గే ఇక లేరు. 70, 80 దశకాల్లో తనదైన హాస్యంతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకొన్న లార్గే కరొనావైరస్ సోకడంతో తలెత్తిన సమస్యలతో కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు.
ఇటీవల గుండెపోటు వచ్చిందని, ఆ క్రమంలో కరోనావైరస్ సోకడంతో లార్గే పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారు జామున మళ్లీ గుండెపోటుకు గురయ్యారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

లార్గే మరణంపై కుమారుడు ర్యాన్ మెక్‌గినిస్ స్పందిస్తూ.. మా జీవితంలో ఈ రోజు చాలా విషాదకరమైనది. మా నాన్న ఈ లోకం విడిచి వెళ్లారనే విషయాన్ని మా అమ్మ, నేను చెప్పాల్సి రావడం అత్యంత దుర్దినం. శుక్రవారం తెల్లవారు జామున మా తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకడంతో మరణించారు అని తెలిపారు.
లార్గే విషయానికి వస్తే.. 1962లో యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. ఇంగ్లాండ్‌లోని పలు ప్రాంతాల్లో పబ్స్, క్లబ్స్ పనిచేశారు. 90వ దశకం వరకు ఆయన యాక్టింగ్ కెరీర్‌ను కొనసాగించారు. 2001లో ఆయన యాక్టింగ్ కెరీర్ నుంచి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత లార్గే హృదయ సంబంధిత వ్యాధికి గురయ్యారు. 2002లో గుండె మార్పిడి జరిగింది.


Click it and Unblock the Notifications











