సంబంధాలలో కమ్యూనికేషన్‌ది ప్రత్యేక పాత్ర: జెస్సికా బీల్
లాస్ ఏంజిల్స్: మానవుని జీవన సంబంధాలలో కమ్యూనికేషన్ అనేది ఎంతో ముఖ్యమైన పాత్రని పోషిస్తుందని హాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెస్సికా బీల్ అంటున్నారు. ప్రముఖ సింగర్ - హీరో జస్టిన్ టింబర్లేక్‌తో ఇటీవలే ఎంగేజ్‌మెంట్ అయి త్వరలో వీరిద్దరూ ఒక ఇంటి వారు కాబోతున్న శుభ సందర్బంలో తన మనసులోని మాటలను పంచుకున్నారు జెస్సికా బీల్.
ఒక భాగస్వామిగా నేను ఇచ్చే గౌరవం ఏమిటంటే కమ్యూనికేషన్. ఒక మగ మనిషి లేదా ఆడ మనిషి కానివ్వడం వారి వారి వ్యక్తిత్వాన్ని బట్టి వారి బాష ఉంటుంది. మీరు ప్రతిరోజూ మీ భాగస్వామితో మాట్లాడుతూ ఉంటే అదోక చిన్నపాటి ఫీలింగ్‌ని కలగజేస్తుందనేది నా నమ్మకం. నేను సరిగ్గా జస్టిన్ తో ఇదే విధంగా ప్రవర్తిస్తాను.
నేను జస్టిన్ టింబర్లేక్‌తో ఆనందంగా ఉండేందుకు గాను నేను నా కాలేజి చదువుని పూర్తి చేయలేకపోయాను. నేను కాలేజీ రోజుల్లో డిగ్రీ పూర్తి చేయాలని అనుకున్నాను. ఆ కాలంలో నేను నా ప్రెండ్స్‌తో ఎక్కువ సమయాన్ని గడపలేకపోయాను, ఎందుకంటే నాకంటే పెద్దవారితో కలిసి పని చేసే అవకాశం లభించింది. ఆ విషయం గుర్తుకి వచ్చినప్పుడల్లా పశ్చాత్తాపపడతాను.
నేను వివిధ డైరెక్షన్స్ నుండి బయటకు లాగబడ్డాను. ఇది నా స్వంత తప్పు ఇందులో ఎవరీ ప్రమేయం లేదు. అప్పుడు నా వయసు 20. నేను కాలేజీ చదువుకోవాల్సిన వయసులో నటనపై దృష్టి సారించాను. దాంతో నా కాలేజీ చదువు అటకెక్కిందని అన్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











