For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ పని చేయడానికే అసలు టైమే లేదు..

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్లీ కూపర్ ఇటీవల కాలంలో సింగర్ జెన్నిఫర్ లోపెజ్‌‌‌తో చేస్తున్నాడంటూ వచ్చిన వార్తలపై మొదటిసారి స్పందించడం జరిగింది. ఈ సందర్బంలో బ్రాడ్లీ కూపర్ మాట్లాడుతూ ప్రస్తుతం నేను సింగిల్ గా ఉన్నప్పటికీ నాకున్న వర్క్ పనిలో పూర్తి బిజీగా గడపడం జరుగుతుంది. ఐతే ఇటీవల కొన్ని ప్రముఖ వెబ్ సైట్స్‌లలో నేను ఓలివా వైడ్, సింగర్ జెన్నిఫర లోపెజ్‌‌తో డేటింగ్‌లు, రొమాన్స్‌లు చేస్తున్నానంటూ వార్తలు ప్రచురించడం జరిగింది. అవన్నీ కేవలం కల్పితాలు మాత్రమే. అటువంటి వాటిని ఎవరూ అభిమానులు నమ్మోద్దంటూ ఓ ప్రమఖ మ్యాగైజన్‌‌కి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు.

    36 సంవత్సరాలు వయసు కలిగిన బ్రాడ్లీ కూపర్ ప్రస్తుతం న్యూయార్క్‌లో షూటింగ్ జరుగుతున్న 'ద ప్లేస్ బియాండ్ ద పైన్స్' అనే సినిమాలో రేయన్ గ్లోస్లింగ్ తో పాటు కలసి నటించడం జరుగుతుందన్నారు. ఇది ఇలా ఉంటే ప్రముఖ వెబ్ సైట్ అయిన షోబిజినెస్ వీరిద్దరూ కలసి డిన్నర్‌కి న్యూయార్క్ వీధిలోని ట్రెండీ రెస్టారెంట్ 'పీర్ సీ'కి వెళ్లినట్లు రాయడం జరిగింది.

    దీనితో పాటు ప్రముఖ టిఎమ్‌జడ్ వెబ్ సైట్ కూడా వీరిద్దరి డిన్నర్‌ని రొమాంటిక్ డిన్నర్‌గా అభివర్ణించింది. 42 సంవత్సరాల వయసు కలిగిన జెన్నిఫర్ లోపెజ్ జులై 15వ తారీఖున తన భర్త మార్క్ ఆంటోనీ నుండి విడపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జెన్నిఫర్ లోపెజ్‌తో డేటింగ్ చేస్తున్న బ్రాడ్లీ కూపర్ కూడా ఒక సంవత్సరం పాటు హీరోయిన్ రీనీ జెల్లవేగర్‌తో డేటింగ్ చేసి మార్చిలోనే ఇద్దరూ విడిపోయారు.

    English summary
    Actor Bradley Cooper says his working commitments leave no time for romance and insists he is currently single. The 36-year-old was recently linked to actress Olivia Wilde and singer Jennifer Lopez.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X